2.0 గురించి క్రేజీ న్యూస్.. ఏఆర్ రెహమాన్‌కు కీరవాణి సాయం.. ఏం చేశారో తెలుసా!
శంకర్ తెరకెక్కించిన విజువల్ వండర్ 2.0 చిత్ర ట్రైలర్ నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా సినీ అభిమానులందరిలో 2.0 మానియాతో నెలకొని ఉంది.ట్రైలర్ లాంచ్ కోసం భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అత్యంత ఉత్కంఠని రేకెత్తిస్తోంది. హాలీవుడ్ నిపుణుల ఆధ్వర్యంలో కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు రూపొందించారు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ చిత్రం గురించి సంగీత దర్శకుడు మరో ఆసక్తికర విషయం వెల్లడించారు.
2.0లో కీరవాణి గాత్రం
ఈ చిత్రంలో దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి పాట పాడారు. ఈ విషయాన్ని 2.0 చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వయంగా వెల్లడించడం విశేషం. కీరవాణి గారు ఈ చిత్రంలో బుల్లి గువ్వ అనే పాట పాడారు. ఆయనకు కృతజ్ఞతలు అంటూ రెహమాన్ ట్వీట్ చేశారు. ఈ సాంగ్ నేడు విడుదల కాబోతోంది.

ప్రపంచం మొత్తం
బాహుబలి సృష్టించిన సంచలనం చూసి ప్రపంచం మొత్తం ఉలిక్కి పడింది. ఇండియన్ సినిమా ఈ స్థాయి విజయం సాధించిందా అని అంతా చర్చించుకున్నారు. ఇప్పుడు 2.0 చిత్రం వైపు హాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

తారాస్థాయిలో చిట్టి, సూపర్ విలన్ పోరాటం
ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ఓ సూపర్ విలన్ గా నటిస్తున్నాడు. మానవాళి మనుగడకు ప్రమాదంగా మారే పాత్రలో అక్షయ్ కుమార్ భయంకరంగా కనిపించబోతున్నాడు. ఈ సూపర్ విలన్ ని చిట్టి ఎలా ఎదుర్కొన్నాడు. వీరిద్దరి మధ్య పోరాటాలు ఎలాఉంటాయి అనే అంశాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

ఏఆర్ రెహమాన్‌కే సాధ్యం
భారీ స్థాయిలో రూపొందే సినిమాలకు సంగీతం అందించాలంటే ఏఆర్ రెహమాన్ లాంటి సంగీత దర్శకుడికి మాత్రమే సాధ్యం. రోబో చిత్రంలో రెహమాన్ సంగీతం సినిమాని మరో స్థాయికి చేర్చింది. 2.0 చిత్రంలో 4డి టెక్నాలజీతో బ్యాగ్ గ్రౌండ్ సంగీతం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











