అది 'మగధీర' ని మరిపించే సినిమా

By Srikanya

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర'ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తమిళంలో అరవన్ టైటిల్ తో ఓ పీరియడ్ డ్రామా నిర్మాణమవుతోంది.ఆ చిత్రం పోస్టర్స్,టైటిల్ సాంగ్ విన్నవారు మగధీర చిత్రాన్ని మరిపించే చిత్రం తయారవుతోందని భావిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో నిర్మితమయ్యే ఈ అరవన్ చిత్రం తెలుగు,తమిళ బాషల్లో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.రవిరాజపినిశెట్టి కుమారుడు ఆది హీరోగా చేస్తున్న ఈ చిత్రం అద్బుతమైన విజువల్స్ తో తెరకెక్కుతోందని చెన్నై వర్గాలు చెప్తున్నాయి.వెయిల్,షాపింగ్ మాల్ వంటి ఎమోషనల్ చిత్రాలు రూపొందించిన వంసంత బాలన్ ఈ చిత్రాన్ని ఓ ప్రెస్టేజియస్ ప్రాజెక్టుగా భావించి రాత్రింబవళ్ళు కష్టపడి చేస్తున్నారు.

ఇక ఆది అయితే ఈ పాత్రకు ప్రాణం పెడుతున్నట్లు చెప్తున్నారు.అలాగే ధనిష్క హీరోయిన్ గా చేస్తోంది.అలాగే ప్లే బ్యాక్ సింగర్ కార్తిక్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.ఇక ఈ చిత్రం గురించి దర్సకుడు వసంత్ బాలన్ మాట్లాడుతూ..అరవన్ అంటే ధీరోదాత్తుడు వెనుతిరిగని వ్యక్తి,ఇంకా చెప్పాలంటే కేవలం పోరాడటానికే పుట్టిన వ్యక్తి అని అర్దం.ఇది పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన కధ.అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగే ఈ చిత్రం ప్రేక్షకులుకు కొత్త అనుభూతి కలిగిస్తుందనుకుంటున్నాను అన్నారు.ఇక ఈ చిత్రం డబ్బిగ్ రైట్స్ ని తెలుగులో ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఓ యువ నిర్మాత తీసుకున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X