శివాజీ రావు గైక్వాడ్.. రజనీ అసలు పేరుతో పాత్ర, ఆ అదృష్టం అతడిదే!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం జూన్ 7 ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందు సిద్ధం అవుతోంది. కబాలి ఫేమ్ పా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రజని అల్లుడు ధనుష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ముంబై మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.
ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అరవింద్ ఆకాష్ కు ఎవరికీ దక్కని అదృష్టం దక్కింది. అరవింద్ ఆకాష్ ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. అతడి పాత్ర పేరు శివాజీ రావు గైక్వాడ్. ఈపాటికే అర్థం అయిఉండాలి అతడి దక్కించుకున్న అదృష్టం ఏమిటో.. అవును రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. సూపర్ స్టార్ అసలు పేరుతో ఆయన చిత్రంలోనే నటించే అవకాశం తనకు మాత్రమే దక్కిందని అరవింద్ ఆకాష్ ఉప్పొంగి పోతున్నాడు.

రజనీకాంత్ అసలు పేరుతో నటిస్తున్న తొలి నటుడ్ని తానే అని అరవింద్ అంటున్నాడు. సీనియర్ నటి ఈశ్వరి రావు, హ్యూమా క్యురేషి, నానా పాటేకర్ వంటి ప్రముఖ నటులంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











