ప్రతీసారి కొత్తగానే...శ్రియ
విశాల్ నేర్పించాడో ఏమో గానీ శ్రియ మాత్రం పిస్తా సినిమా చేస్తున్నప్పటి నుంచి కొత్త కొత్త ఫిలాసపీలు చెప్తోంది. చాలా ఉత్సాహంగా ఉంటోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వూలో...సక్సెస్ సూత్రాలు చెబుతూ..ప్రతీసారి ఒక కొత్త పని చేస్తున్నామన్న ఆసక్తితో పని చేయాలి. ఆ పని ఏదైనా..ఎలాంటిదైనా..అప్పుడే తృప్తి..విజయం అంటోంది శ్రియ. అలాగే మనకు తెలిసున్నఅలవాటుపడిన పనే కదా అనే భావనతో అశ్రద్ధ చేయడమో, తప్పనిసరనో చేయకూడదు. ఎవరికివారు తమ పనిపట్ల పూర్తి శ్రధ్ధను కనపర్చాలి. ఆసక్తితో హృదయపూర్వకంగా, శ్రద్ధగా చేస్తేనే వర్కవుట్ అవుతుంది.
అప్పుడే జీవితంలోని ప్రతి మెట్టునూ హాయిగా దాటుకుంటూ ముందుకు సాగిపోగలుగుతాం..అంటోంది శ్రేయ. మీ సక్సెస్ సూత్రం ఏమిటీ అంటే...ఈ సూత్రాలను బాగా వంటబట్టించుకున్న ఆమె తన ప్రెండ్స్ ఎవరైనా నిరాశా, నిస్పృహలతో ఉన్నట్లయితే వారికి తన వద్ద నున్న ఈ సూత్రాలను చెప్పి ఉత్సాహపరుస్తుంది. అది సరే విశాల్ చెప్పాడా ఈ విషయాలన్నీ లేక నీ అనుభవంతో తెలుసుకున్నావా...అది విశాల్ తో ఉన్నప్పుడు అంటే మాత్రం మూతి తిప్పుకుని మాట మార్చింది.
ఇక చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ మాత్రం శ్రియ, విశాల్ పూర్తి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అయితే విశాల్ ఎవరితో నటిస్తే వారితో ఇలాంటి వార్తలు రావటం అత్యంత సహజం అయిపోవటంతో వీటికి పెద్ద ప్రయారిటీ ఇవ్వటం లేదు. అలాగే ఈ విషయంపై మీడియా నిలదీస్తే..మేం కేవలం మంచి స్నేహితులం అంటున్నారు. అయితే శ్రియ ఇంతకు ముందు మాట్లాడితే ముంబయి చెక్కేసేది అలాంటిది పిస్తా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి రాత్రి తొమ్మిది దాటితే చెన్నైలోని హోటల్ రూమ్ దాటి రావటం లేదంటున్నారు.


Click it and Unblock the Notifications











