రీమేక్‌ రైట్స్ మోహన్ బాబు తీసుకున్నారు

By Srikanya

చెన్నై : మరో భాషలో హిట్టైన సినిమాలపై మనవాళ్లు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. సినిమా బాగుందంటే వెంటనే దాని రైట్స్ తీసుకుని రీమేక్ కు శ్రీకారం చుడుతూంటారు. తాజాగా తమిళంలో విక్రంప్రభు హీరోగా నటించిన 'అరిమానంబి' 50 రోజులకు పైగా ప్రదర్శితమై.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని మోహన్ బాబు తీసుకున్నారు.

దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ శిష్యుడు ఆనంద్‌ శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళంలో హిట్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు తెలుగు పరిశ్రమ నుంచి పలువురు అనువాదం, రీమేక్‌ హక్కుల కోసం పోటీపడినట్లు సమాచారం. చివరకు నటుడు మోహన్‌బాబు ఈ సినిమా రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్నారు.

Arima Nambi to be remade in Telugu

ఈ విషయం గురించి నిర్మాత కలైపులి ఎస్‌.థాణు మాట్లాడుతూ.. 'అరిమానంబి' విజయం నాలో ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా రీమేక్‌ హక్కుల కోసం తెలుగు వారు పలువురు నన్ను సంప్రదించారు. అదే విధంగా నా మిత్రుడు మోహన్‌బాబు కూడా అడిగారు. కాదనలేకపోయా. రీమేక్‌ హక్కులను ఆయనకే ఇచ్చేశా. అయితే ఇందులో ఎవరెవరు నటిస్తున్నారనే విషయం తెలియదని చెప్పారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో విక్రంప్రభు పాత్రలో నటుడు విష్ణు, హీరోయిన్ ప్రియా ఆనంద్‌ పాత్రలో హన్సిక నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడుగా ఎవరిని ఎంపిక చేసారనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ చిత్రం ఇక్కడా హిట్ అవుతుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X