మణిరత్నం చిత్రంలో విలన్‌గా యాక్షన్ కింగ్
యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న అర్జున్ త్వరలో మణిరత్నం దర్శకత్వంలో నటించనున్నారు.ఈ చిత్రం టైటిల్ పూక్కడై. ఇన్నాళ్లూ హీరోగా తమిళం, కన్నడం, తెలుగు భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన అర్జున్ ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా తర్ఫీదు సైతం పొందుతున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ద్వారా తమిళ సీనియర్ నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. హీరోయిన్ ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. సమంత, కార్తీకతో సహా చాలా మందిని ఫోటో షూట్ చేసి రిజెక్టు చేసారు.
రామేశ్వరం మత్స్య కారుల కుటుంబాల బ్యాక్ డ్రాప్ తో సాగే ఒక అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇక అర్జున్ పాత్ర విషయానికి వస్తే మంగాత్తా చిత్రంలో అజిత్ పాత్ర తరహాలో ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం ఎప్పటిలాగే ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహ్మాన్ అందించనున్నారు. ఈ విషయమై అర్జున్ మాట్లాడుతూ..మణిసార్ చిత్రంలో ఆఫర్ రావటం తన అదృష్టమన్నారు.


Click it and Unblock the Notifications











