హీరో అర్జున్ సూపర్ హిట్ కి సీక్వెల్ ఖరారు
ఈ సీక్వెల్ చిత్రాన్ని ఆస్కార్ ఫిలింస్ రవిచంద్రన్ నిర్మించనున్నారు. హీరోగా నటించడంతోపాటు దర్శకత్వ బాధ్యత కూడా అర్జునే తీసుకోనున్నారు. తీవ్రవాద ఇతివృత్తాన్నే తీసుకుని.. ప్రస్తుత పరిస్థితుల్ని ప్రతిబింబించేలా దీన్ని తెరకెక్కించనున్నట్లు కోలీవుడ్ సమాచారం. అర్జున్ దేశభక్తిని ప్రతిబింబించే పలు చిత్రాల్లో నటించారు. అందులో ఒకటి 'జైహింద్'.
యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న అర్జున్ త్వరలో మణిరత్నం దర్శకత్వంలో నటించనున్నారు.ఈ చిత్రం టైటిల్ పూక్కడై. ఇన్నాళ్లూ హీరోగా తమిళం, కన్నడం, తెలుగు భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన అర్జున్ ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా తర్ఫీదు సైతం పొందుతున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ద్వారా తమిళ సీనియర్ నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు.
రామేశ్వరం మత్స్య కారుల కుటుంబాల బ్యాక్ డ్రాప్ తో సాగే ఒక అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇక అర్జున్ పాత్ర విషయానికి వస్తే మంగాత్తా చిత్రంలో అజిత్ పాత్ర తరహాలో ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం ఎప్పటిలాగే ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహ్మాన్ అందించనున్నారు. ఈ విషయమై అర్జున్ మాట్లాడుతూ..మణిసార్ చిత్రంలో ఆఫర్ రావటం తన అదృష్టమన్నారు.
మరో ప్రక్క అర్జున్ కన్నడ చిత్ర పరిశ్రమలో బిజీ అవుతున్నారు. దాదాపు 11 ఏళ్ళ విరామం తర్వాత 'ప్రసాద్' చిత్రం ద్వారా కన్నడ ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ చిత్రానికి బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే అర్జున్ దర్శకత్వం వహిస్తున్న ఒక కన్నడ సినిమా త్వరలో విడుదల కానుంది. మరోపక్క 'వీరప్పన్' అనే సినిమాలో ఒక పోలీస్ అధికారి పాత్ర పోషించనున్నట్లు చెప్పాడు.


Click it and Unblock the Notifications












