అచ్చం 'అర్జున్ రెడ్డి'ని దించేశారుగా! ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాలు.. వైరల్ వీడియో
టాలీవుడ్ సినిమాల్లో కెల్లా ఇప్పటికీ, ఎప్పటికీ 'అర్జున్ రెడ్డి' సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ 'కబీర్ సింగ్' సంచలనాలకు మారుపేరు కాగా.. తాజాగా అర్జున్ రెడ్డి కోలీవుడ్ రీమేక్ 'ఆదిత్యవర్మ' సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతోంది.
నిజానికి 'ఆదిత్యవర్మ' మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటించిన ఈ సినిమాకు మొదట బాల దర్శకత్వం వహించాడు. దానికి వర్మ అనే పేరు డిసైడ్ చేశారు. సినిమా అంతా పూర్తయ్యాక అవుట్‌పుట్ బాగా రాలేదని చిత్ర దర్శకుడిని మార్చేయడం జరిగింది. దీంతో మళ్ళీ రీ షూట్ చేసుకున్న ఈ సినిమా 'ఆదిత్యవర్మ'గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి గిరీశయ్య అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు.

తాజాగా 'ఆదిత్యవర్మ' ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. అచ్చం తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను 'ఆదిత్యవర్మ' పేరుతో రీమేక్ చేశారని స్పష్టమవుతోంది. ధృవ్.. మాస్ పర్‌ఫార్‌మెన్స్ చూసి ఫిదా అవుతున్నారు కోలీవుడ్ ఆడియన్స్. ట్రైలర్ లో చూపించిన ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాలు సినిమాపై హైప్ నెలకొల్పాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అర్జున్ రెడ్డి ముద్దులకు టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలు షేక్ అయ్యాయి. సో.. చూడాలి మరి కోలీవుడ్ కూడా ఇలాగే షేక్ అవుతుందా? లేదా? అనేది.


Click it and Unblock the Notifications











