తమిళ అర్జున్ రెడ్డి వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక సంచలనమే!

టాలీవుడ్ సినిమాల్లో కెల్లా ఇప్పటికీ, ఎప్పటికీ 'అర్జున్ రెడ్డి' సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. విజయ్ దేవరకొండ, షాలినీ పాండే హీరో హీరోయిన్లుగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా యూత్ ఆడియన్స్‌కి యమ కిక్కిచ్చింది. అందుకే ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు.

ఇప్పటికే అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ 'కబీర్ సింగ్' విడుదలై సంచలనాలకు మారుపేరు కాగా.. తాజాగా అర్జున్ రెడ్డి కోలీవుడ్ రీమేక్ 'ఆదిత్యవర్మ' సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతోంది. గిరీశాయ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్నాడు. ఇదే ఆయనకు తొలి సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాలో ఆయన సరసన బనిత సంధు అనే అమ్మాయి హీరోయిన్‌గా నటించింది.

 Arjun Reddy Remake Adithya Varma Release Date Fixed

ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియాలో అఫీషియల్ ప్రకటన ఇచ్చేశారు. నవంబర్ 21వ తేదీన 'ఆదిత్య వర్మ' ప్రేక్షకుల ముందుకు రానుందని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో కొడుకు ధృవ్‌తో కలిసి విక్రమ్ కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేయడమే గాక, ప్రేక్షక లోకంలో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. చూడాలి మరి కోలీవుడ్‌లో అర్జున్ రెడ్డి ప్రతాపం ఎలా ఉండనుందో!.

నిజానికి 'ఆదిత్యవర్మ' మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాకు మొదట బాల దర్శకత్వం వహించాడు. దానికి వర్మ అనే పేరు డిసైడ్ చేశారు. సినిమా అంతా పూర్తయ్యాక అవుట్‌పుట్ బాగా రాలేదని చిత్ర దర్శకుడిని మార్చేయడం జరిగింది. దీంతో మళ్ళీ రీ షూట్ చేసుకున్న ఈ సినిమా 'ఆదిత్యవర్మ'గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X