అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్!
'అర్జున్ రెడ్డి' మూవీ తెలుగులో సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రాన్ని తమిళం, హిందీలో కూడా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్' పేరుతో విడుదలవ్వగా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.
తమిళంలో 'ఆదిత్య వర్మ' పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. తెలుగు వెర్షన్‌కు సందీప్ రెడ్డి వద్ద అసిస్టెంటుగా పని చేసిన గిరీశాయ దర్శకత్వం వహించారు. ఇటీవల టీజర్ విడుదలవ్వగా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్ కుమారుడు ధృవ్ పెర్ఫార్మెన్స్ సినిమాపై పాజిటివ్ బజ్ పెరిగేలా చేసింది.
తాజాగా సమాచారం ప్రకారం 'ఆదిత్య వర్మ' రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారట. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ సమాచారం వెలువడనుందట.

తొలుత బాలా దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఫైనల్ కాపీ చూసిన చిత్ర నిర్మాతలు (ఇ4 ఎంటర్టెన్మెంట్స్) తాము కోరుకున్న విధంగా సినిమా రాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ... కొత్త దర్శకుడు, కొత్త టెక్నీషియన్లతో సినిమా మళ్లీ తీసిన సంగతి తెలిసిందే.
తన కుమారుడు నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఏదైనా తేడా వస్తే అతడి కెరీర్ మీదనే ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశ్యంతో విక్రమ్ ఇలా చేయించారట. అర్జున్ రెడ్డి చిత్రాన్ని బాలా ఉన్నది ఉన్నట్లు తీయకుండా మార్పులు చేశారని, ఇది నచ్చని విక్రమ్, నిర్మాతలు... సందీప్ రెడ్డి అసిస్టెంటును రంగంలోకి దింపి సీన్ టు సీన్ రీమేక్ చేయించారని టాక్. హిందీలో ఇలా తీయడం వల్లే హిట్ అయింది. మరి తమిళంలో ఎలాంటి ఫలితం ఇస్తోందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











