‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్: బాలను తప్పించి అన్నీ మార్చేశారు, వివరాలు ఇవే!
తెలుగు సూపర్ హిట్ మూవీ 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని తమిళంలో హీరో విక్రమ్ కుమారుడు ధృవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట బాల దర్శకత్వంలో 'వర్మ' అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని షూట్ చేశారు. అయితే సినిమా ఫైనల్ ఔట్‌పుట్ సంతృప్తి కరంగా లేదనే కారణంతో... దర్శకుడు బాలను పక్కకు తప్పించి, మొత్తం సినిమాను మళ్లీ రీ షూట్ చేయాలని నిర్ణయించారు.
రీ షూట్ చేయబోయే న్యూ వెర్షన్‌కు 'ఆదిత్య వర్మ' అనే టైటిల్ ఫైనల్ చేశారు. ఈ చిత్రాన్ని గిరీశయ్య దర్శకత్వం వహించబోతున్నారు. ధృవ్ సరసన బనితా సంధు హీరోయిన్‌గా ఎంపికైంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఇ4 ఎంటర్టెన్మెంట్ వారు... హీరో ధృవ్ తప్ప దర్శకుడు, మిగతా నటీనటులు, టెక్నీషియన్లు అందరినీ మార్చేశారు.

'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ 'వర్మ' మూవీ విషయంలో జరుగుతున్న వివాదంపై ఆ చిత్ర దర్శకుడు బాలా స్పందించారు. నిర్మాతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ సినిమా నుంచి తానే తప్పుకున్నట్లు వెల్లడించారు.
ఈ గొడవపై తాను మాట్లాడటం మొదలు పెడితే 'ధృవ్' భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. అందుకే ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నానని బాల తెలిపారు. అయితే గొడవ ఎందుకు వచ్చిందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications











