twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంత నష్టమైనా భరిస్తా.. మా అబ్బాయి సినిమా ఆపేయండి.. అర్జున్ రెడ్డి రీమేక్ చూసి!

    |

    Recommended Video

    Tamil Arjun Reddy Film Has Stopped | Filmibeat Telugu

    థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదలైపోయింది. స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ లుక్స్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ వర్మ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఈ తరుణంలో భారీ షాక్.. వర్మ చిత్రం ఆగిపోయిందంటూ నిర్మాతలు ప్రకటించేశారు. ఈ వార్త తమిళ సినీ వర్గాల్లో సంచలనంగా మారుతోంది. విక్రమ్ తనయుడు ధృవ్ డెబ్యూ మూవీకే ఇలా జరగడం ఏంటి అంటూ అంతా చర్చించుకుంటున్నారు. దీనివెనుక ధృవ్ తండ్రి విక్రమ్ హస్తం ఉందంటూ మరో సంచలన ప్రచారం మొదలైంది.

    విక్రమ్ తనయుడు హీరోగా

    విక్రమ్ తనయుడు హీరోగా

    తన కుమారుడిని ఇంకా కొన్ని రోజుల తర్వాత లాంచ్ చేద్దామని తాను భావించినట్లు విక్రమ్ వర్మ చిత్రం ప్రారంభానికి ముందు తెలిపాడు. కానీ తెలుగు అర్జున్ రెడ్డి సినిమా చూశాక నా నిర్ణయాన్ని మార్చుకున్నా. అర్జున్ రెడ్డి చిత్రమే నా తనయుడికి సరైన లాంచ్ అని తాను భావించినట్లు విక్రమ్ తెలిపారు. అనుకున్నదే తడువుగా సీనియర్ డైరెక్టర్ బాల దర్శత్వంలో ఈ చిత్రాన్ని ప్రకటించేశారు.

    భారీ అంచనాలు

    భారీ అంచనాలు

    తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై తిరుగులేని విజయాన్ని సాధించింది అర్జున్ రెడ్డి. ఒక్క మాటలో చెప్పాలంటే బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం గురించి ఆసక్తికర చర్చ జరిగింది. స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ ఈ చిత్ర రీమేక్ లో నటిస్తున్నాడు అని ప్రకటించగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రారంభమై దాదాపుగా షూటింగ్ ముగిసింది. ట్రైలర్ కూడా విడుదలై ధృవ్ ఆకట్టుకున్నాడు అంటూ ప్రశంసలు దక్కాయి. ఇలాంటి తరుణంలో వర్మ చిత్రం ఆగిపోయిందని, ఈ చిత్రాన్ని తాము విడుదల చేయడం లేదని నిర్మాతలు ప్రకటించారు.

    షాకింగ్: ‘అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ చెత్తకుప్పలో పడేసి.. మళ్లీ రీ షూట్?షాకింగ్: ‘అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ చెత్తకుప్పలో పడేసి.. మళ్లీ రీ షూట్?

    సంతృప్తిగా లేదు

    సంతృప్తిగా లేదు

    వర్మ సినిమా ఫైనల్ అవుట్ పుట్ పై మేము సంతృప్తిగా లేము అని నిర్మాతలు తెలిపారు. క్రియేటివిటీ, ఇతర అంశాల పట్ల చాలా విభేదాలు ఉన్నాయి. కాబట్టి వర్మ చిత్రాన్ని విడుదల చేయకూడదని నిర్ణయించుకుంటున్నాం అని ప్రకటించారు. దర్శకుడు ఈ చిత్రాన్ని సరిగా డీల్ చేయలేదనే వార్తలు వస్తున్నాయి. వర్మ చిత్రం ఆగిపోవడానికి అసలు కారణం నిర్మాతలు కాదని. ధృవ్ తండ్రి విక్రమే అని ప్రచారం జరుగుతోంది. బాల తన గురువు అయినప్పటి ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం విక్రమ్ కు ఏ మాత్రం నచ్చలేదట.

    ఎంత నష్టమైనా భరిస్తా

    ఎంత నష్టమైనా భరిస్తా

    నష్టం ఎంతైనా నేను భరిస్తా.. వర్మ చిత్రాన్ని వెంటనే ఆపేయండి. దర్శకుడిని, ఇతర టెక్నీషియన్స్ ని మార్చేసి మళ్ళీ కొత్తగా ప్రారంభించండి అని విక్రమ్ నిర్మాతలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఫైనల్ అవుట్ పుట్ చూసిన విక్రమ్.. ఈ సినిమా విడుదలైనతే తన కొడుకు భవిష్యత్తుని రిక్స్ లో పెట్టినట్లే అని విక్రమ్ భయపడ్డాడట. ఆయనే సినిమాని ఆపేయమని చెప్పడంతో నిర్మాతలు ప్రకటించారు.

     దర్శకుడితో విభేదాలు

    దర్శకుడితో విభేదాలు

    మరో వైపు నిర్మాతలు కూడా దర్శకుడి పనితనంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు వర్షన్ లోని చాలా సన్నివేశాలని మార్చి చిత్రీకరించడంతో నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారట. ఈ చిత్రాన్ని మళ్ళి కొత్తగా ప్రారంభించి 2019లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తంగా తన కొడుకు విషయంలో విక్రమ్ ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యేలా కనిపించడం లేదు.

    English summary
    Arjun Reddy Tamil remake Varmaa has been shelved and to be reshot again
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X