రజనీకే కాదు అర్జున్ దీ అదే సమస్య

By Srikanya

చెన్నై : తమ పిల్లలు తమకన్నా గొప్పగా ఎదగాలని తల్లి తండ్రులు కోరుకోవటం సహజం. అందుకు సూపర్ స్టార్, యాక్షన్ కింగ్ అతీతులు కారు. వాళ్ల కెరీర్ లు సజావుగా వెళ్లితే సమస్య లేదు..లేకపోతే వారే వీళ్లకి మనశ్సాంతి లేకుండా చేస్తూ సమస్యలుగా మారతారు. కెరీర్ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న తమ కుమార్తెల కెరీర్‌ లు నిలబెట్టే పనిలో ఉన్నారు సీనియర్ హీరోలు యాక్షన్‌కింగ్‌ అర్జున్, సూపర్ స్టార్ రజనీకాంత్‌. రజనీకాంత్ ఇప్పటికే తన కుమార్తె దర్శకత్వంలో నటించి, అది విడుదల సమస్యలు ఎదుర్కొంటూంటే దాన్ని పరిష్కరించే పనిలో బిజీగా ఉన్నారు.

మాస్‌ చిత్రాలతో అలరిస్తూ యాక్షన్‌ హీరోగా చెరగని ముద్ర వేసిన నటుడు అర్జున్‌. అపజయాలు ఎదురైన ప్రతీసారి అర్జున్‌ తన చేతిలోకి ఓ ఆయుధాన్ని తీసుకుంటారు. అదేంటంటే తానే ఓ కథను సిద్ధం చేసుకుంటారు. దాన్ని తానే నిర్మించి దర్శకత్వం కూడా వహిస్తారు. అలా చేసిన ప్రయత్నాలు చాలాసార్లు చక్కని ఫలితాన్నే ఇచ్చాయి. ఇప్పటికే హీరోగా కొనసాగుతున్న అర్జున్‌.. ప్రస్తుతం కుమార్తె కెరీర్‌ను దారికి తెచ్చే పనిలో ఉన్నారట.

Arjun wants to direct her daughter Aishwarya

విశాల్‌కు జంటగా ఐశ్వర్య 'పట్టత్తుయానై'లో నటించింది. ఇది ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించని నేపథ్యంలో ఆమెకు కొత్త అవకాశాలేవీ రాలేదు. ప్రస్తుతం కుమార్తె కోసం తానే ఓ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారట అర్జున్‌. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారట. కథ ఓ కొలిక్కి వచ్చాక హీరో, ఇతర విషయాలపై దృష్టి సారించనున్నారట. ఇది ఎంతవరకు సత్ఫలితం ఇస్తుందో వేచి చూడాల్సిందే.

దర్శకురాలు సౌందర్య తన తండ్రి రజనీకాంత్‌ ద్విపాత్రల్లో నటించిన 'కోచ్చడయాన్‌'ను తెరకెక్కించారు. ఇప్పటి వరకు ఆరుసార్లు ఈ చిత్ర విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అధికారికంగా ప్రకటించారు. చివరి క్షణంలో ఈ తేదీని 23కి మార్చారు. పంపిణీదారులు సినిమా కొనుగోలు ధరను తగ్గించాలని డిమాండ్‌ చేయడంతోనే ఈ పరిస్థితి నెలకొందని వార్తలొచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X