‘ఐ’: ఆర్నాల్ స్వార్జ్‌నెగ్గర్ వచ్చాడోచ్..(ఫోటోస్)
చియాన్ విక్రమ్ హీరోగా ఆస్కార్ ఫిలింస్ ప్రై.లి.బ్యానర్లో గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఐ'. ఈ చిత్రం ఆడియో వేడుకకు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆర్నాల్డ్ చెన్నై చేరుకున్నారు.
ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమాని కూడా నిర్మించని విధంగా 180 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్ తో ‘ఐ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ కలిసి తెలుగులో ‘ఐ' పేరుతోనే విడుదల చేస్తున్నారు. నేడు (సెప్టెంబర్ 15) ‘ఐ' చిత్రానికి సంబంధించిన ఆడియో ఫంక్షన్ చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరుగబోతోంది.
స్లైడ్ షోలో ఆర్నాల్ స్వార్జ్ నెగ్గర్‌కు సంబంధించిన ఫోటోలు...

ఆర్నాల్డ్ తో పాటు...
ఈ ఆడియో ఫంక్షన్‌కి హాలీవుడ్ సూపర్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగెర్, సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.

భారీగా అభిమానులు
భారీగా సీని అభిమానులు తరలి రానున్న నేపథ్యంలో దాదాపు ఏడెకరాల విస్తర్ణం ఉండే నెహ్రూ స్టేడియాన్ని ఆడియో వేడుకగా ఎంచుకున్నారు.

ఐ మూవీ గురించి..
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు.

భారీ బడ్జెట్
వందేళ్ల భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో 20,000 థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











