అదిరింది : ఆడియో పంక్షన్ కు గెస్ట్ గా ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్
చెన్నై : ఆడియో పంక్షన్ కు క్రేజ్ అనేది ఆ వచ్చే గెస్ట్ పై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ తమిళంలో ఓ కార్యక్రమంలో సందడి చేయనున్నాడు అనే వార్త బయటకు రాగానే అందరి దృష్టీ ఒక్కసారిగా ఆ చిత్రం మీదకు మళ్లింది. ఆ చిత్రం మరేదో కాదు.... శంకర్ దర్శకత్వంలో విక్రం నటిస్తున్న 'ఐ' . ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చుతున్నారు.
విక్రమ్ ఇందులో కొత్త ఆహార్యంలో కనిపించనున్నారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని చెన్నైలో ఘనంగా నిర్వహించనున్నారు. సినీ ప్రముఖులు పలువురు పాల్గొననుండగా.. ప్రత్యేక ఆకర్షణగా హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ కూడా పాల్గొంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదివరకు కమల్‌హాసన్ హీరోగా ఆయనే నిర్మించిన 'విశ్వరూపం' ఆడియో వేడుకకు జాకీచాన్‌ను ఆహ్వానించారు ఆస్కార్ రవిచంద్రన్. 'ఐ'కు ఆర్నాల్డ్‌ను ఆహ్వానించినట్లు, దీనికి ఆయన కూడా సమ్మతించినట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

విజయాలకు దూరమైనా... వైవిధ్యానికి మాత్రం సమీపంలో ఉండే హీరో విక్రమ్. 'దైవతిరుమగళ్'లో మానసిక పరిపక్వత లేని వ్యక్తిగా... 'రాజపాట్త్టె'లో యాంగ్రీ యంగ్‌మేన్‌గా, 'తాండవం'లో యాక్షన్ హీరోగా కనిపించిన విక్రమ్... 'ఐ'లో అత్యంత నాజూగ్గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన తన శరీరాన్ని ఎంతగానో శ్రమ పెట్టి భారీగానే బరువు తగ్గారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతూ అంచనాలు పెంచిన ఈ చిత్రానికి విక్రమ్ ఆహార్యం మరో ఆకర్షణగా మారింది. కేవలం ఆకుకూరలు, పండ్లు మాత్రమే తింటూ ఈ రూపాన్ని సంతరించుకున్నాడట విక్రమ్.
'అపరిచితుడు'గా విక్రంను తీసుకువచ్చి దక్షిణాదికే సుపరిచితం చేసిన శంకర్.. మళ్లీ 'ఐ'తో మరో విజయాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. 'ఐ' కోసం నటుడు విక్రం సకలవిధాలా తనను తాను మలుచుకుంటున్నారు. కథకు తగ్గట్లు తన శరీరాకృతిని మార్చుకుంటున్నారట. మూడు భిన్న కోణాల్లో విక్రం కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక విషయాలేవీ బయటకు రాకపోయినా.. కొన్ని మాత్రం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.
ఈ చిత్రంలో విక్రమ్...తమిళనాడు స్టేట్ భాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించనున్నాడని సమాచారం. . ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది 'ఐ' చిత్ర కథ అని వినపడుతోంది. అందుకోసం ఆయన ఎనిమిది కేజీలు పైగా బరువు తగ్గారు. ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది.
స్లిమ్‌విక్రం, ఏఆర్ రెహ్మాన్, పీసీ శ్రీరాం.. ఈ అద్భుతమైన కలయికలో వస్తున్న 'ఐ' చిత్ర ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందంటున్నారు.


Click it and Unblock the Notifications











