ఇడ్లీ, దోశపై లొట్టలేసిన ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్, అరిగే దాకా...
హైదరాబాద్: ఇటీవల జరిగిన ‘ఐ' మూవీ ఆడియో వేడుక సందర్భంగా ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ చెన్నై వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సౌతిండియా సాంప్రదాయ వంటకాలపై మనసు పారుసుకున్నారు. ఇడ్లీ, దోశ, పొంగల్ లాంటి వంటకాలను ఇష్టంగా లాగించేసారట. అంతే కాకుండా తిన్నది అరిగేదాకా ఆరు గంటల పాటు జిమ్ లో వర్కౌట్లు కూడా చేసారట.
శంకర్ దర్శకత్వంలో చేయాలని...

సోమవారం జరిగిన "ఐ" మూవీ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్నాల్డ్ ఈ సందర్భంలో స్టేజీ మీద మాట్లాడుతూ.. ఇలా శంకర్ సినిమాలో తనక్కూడా నటించాలనుందని పేర్కొన్నాడు. అలాగే శంకర్ ను బాగానే పొగడ్తలతో ముంచెత్తేశాడు.
"ఐ" సినిమా విషయానికొస్తే...ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమాని కూడా నిర్మించని విధంగా 180 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్ తో ‘ఐ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ కలిసి తెలుగులో ‘ఐ' పేరుతోనే విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











