నటిపై రాజకీయ దాడి మొదలైంది.. కేసు నమోదు, ఇలాంటి సినిమాల వల్లే రేప్‌లు!

హీరోయిన్ ఓవియా పేరు ప్రస్తుతం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆమె నటించిన 90 ఎంఎల్ చిత్రం తీవ్ర వివాదంగా మారుతోంది. ఓవియా తమిళ బిగ్ బాస్ 1లో పాల్గొంది. అంతకు ముందు కూడా ఓవియా హీరోయిన్ గా నటించింది. కానీ ఒవియాకు ఎలాంటి గుర్తింపు లభించలేదు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత ఓవియా జాతకం ఒక్కసారిగా మారిపోయింది. లక్షలాది మంది ఆమెకు అభిమానులుగా మారిపోయారు. ఈ షో తర్వాత ఓవియా నటించిన తొలి చిత్రం 90 ఎంఎల్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శల పాలవుతోంది.

మహిళా దర్శకురాలు

మహిళా దర్శకురాలు

ఇటీవల మహిళల వ్యక్తిగత జీవితానికి సంబందించిన అంశాలతో చిత్రాలు, వెబ్ సిరీస్ లో ఎక్కువవుతున్నాయి. వీటికి బోల్డ్ కంటెంట్ మూవీస్ అని కూడా పేరు పెట్టేశారు. వల్గారిటీకి అధిక ప్రాధాన్యత నిస్తూ యువతని ఆకర్షించడమే లక్షయంగా 90 ఎంఎల్ లాంటి చిత్రాలు పుట్టుకువస్తున్నాయి. 90 ఎంఎల్ చిత్రాన్ని తెరకెక్కించిన మహిళా దర్శకురాలు అనిత ఉదీప్ పై విమర్శల వర్షం కురుస్తోంది.

 తమిళ నిర్మాత

తమిళ నిర్మాత

తమిళ నిర్మాత ధనుంజయన్ 90 ఎంఎల్ సమాజాన్ని భ్రష్టు పట్టించే సినిమా అని అభివర్ణించారు. దీనికి అనిత ఉదీప్ వెటకారంగా బదులిచ్చింది. మీ కామెంట్స్ బోరు కొడుతున్నాయి. కొత్తగా మాట్లాడండి అని అనిత సోషల్ మీడియాలో ధనుంజయన్ విమర్శలకు స్పందించింది. ఒక్క ధనుంజయన్ కు అయితే సమాధానం ఇచ్చింది కానీ.. ఇప్పుడు ఈ వివాదం రాజకీయ రూపం దాల్చుకుంది.

రాజకీయ దాడి

రాజకీయ దాడి

ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 90 ఎంఎల్ చిత్రంపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. 90 ఎంఎల్ చిత్రం అత్యాచారాలని ప్రేరేపించేలా ఉందని పోలీస్ కమిషనర్ కార్యలయంలో ఫిర్యాదు చేశారు. దీనితో నటి ఓవియా, చిత్ర యూనిట్ పై కేసు నమోదైంది. 90 ఎంఎల్ చిత్రం ఏమాత్రం అంగీకరించలేని విధంగా ఉందని ఇండియన్ నేషనల్ లీగ్ కార్యకర్తలు దుయ్యబడుతున్నారు.

అలాంటి సన్నివేశాలే

అలాంటి సన్నివేశాలే

ఈ చిత్రంలో హీరోయిన్ మద్యం, సిగరెట్ తాగే సన్నివేశాలు, శృంగారం, లెస్బియన్ సీన్స్, వల్గర్గా ఉండే డైలాగులని దర్శకురాలు అనిత ఉదీప్ హైలైట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మన సంప్రదాయాల్ని విలువల్ని మంటగలిపే విధంగా ఉందనే వాదన వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. ఈ చిత్రానికి స్టార్ హీరో శింబు సంగీతం అందించడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X