రాధిక-శరత్ కుమార్ దంపతులకు అరెస్ట్ వారెంట్
తమిళ నటులు, భార్యభార్తలైన రాధిక, శరత్‌కుమార్ న్యాయ పరమైన చిక్కుల్లో పడ్డారు. చెక్ బౌన్స్ కేసులో వీరికి అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ మేరకు చెన్నైలోని సైదాపేట కోర్టు ఆదేశాలు జారీచేసింది. వీరితో పాటు నిర్మాత లిస్టిన్ స్టీఫెన్‌కు కూడా ఇందుకు సంబంధించిన నోటీసులు అందుకున్నారు.
చెక్ బౌన్స్ కేసులో ఈ ముగ్గురు జూన్ 28న సైదాపేట్ కోర్టుకు హాజరవ్వాల్సి ఉండగా... రాలేదు. దీంతో వారిపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణ వచ్చే నెల జులై 12వ తేదీకి వాయిదా వేశారు.

సినిమాలు నిర్మించేందుకు రేడియన్స్ మీడియా సంస్థ నుంచి నటి రాధిక, ఆమె భర్త శరత్‌కుమార్, నిర్మాత లిస్టిన్ స్టీఫెన్‌లు రూ.2 కోట్లు అప్పుగా తీసుకున్నారు. వీరు గడువులోపు డబ్బు చెల్లించడంలో విఫలం అయ్యారు. దీంతో పాటు వీరు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో నిర్మాత కోర్టును ఆశ్రయించాడు.
తమకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా ఈ ముగ్గురు ఇబ్బంది పెడుతున్నారని, తమకు రావాల్సిన మొత్తం దక్కేలా న్యాయం చేయాలని రేడియన్స్ మీడియా సంస్థ కోర్టుకు విన్నవించింది. ఈ ముగ్గురుపై అరెస్ట్ వారెంట్ జారీ అవ్వడం తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











