డైరెక్టర్ బాలా, హీరో ఆర్యపై అరెస్ట్ వారెంట్ జారీ

By Bojja Kumar

తమిళ దర్శకుడు బాలా, హీరో ఆర్యపై అరెస్ట వారెంట్ జారీ అయింది. బాల దర్శకత్వంలో 2011లో వచ్చిన 'వాడు-వీడు' సినిమాకు సంబంధించిన కేసులో కోర్టు ముందు హాజరు కావాలని పలు సార్లు నోటీసులు జారీ చేసినా రాక పోవడంతో తమిళనాడులోని తిరునెల్వెలి కోర్టు ఈ ఇద్దరిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

బాలా దర్శకత్వంలో తమిళ కామెడీ డ్రామాగా తెరకెక్కిన 'అవన్-ఇవన్' (వాడు-వీడు)లో విశాల్, ఆర్య, జనని ఐయ్యర్, మధు శాలిని ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో సింగంపట్టి జమిందార్‌ను కించ పరిచినట్లు చూపించారంటూ శంకర్ ఆత్మజన్ అంబానీ అప్పట్లో కేసు వేశారు.

Arrest warrant issued against Arya and director Bala

చాలా కాలం తర్వాత ఈ కేసు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. గత కొన్నేళ్లుగా విచారణ సాగుతున్నా, ఎన్నిసార్లు సమన్లు అందినా వారు రాక పోవడంతో ఈ సారి కోర్టు వారిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరి దీనిపై బాలా, ఆర్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

'అవన్-ఇవన్' తెలుగులో వాడు-వీడు పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో విశాల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై కాల్పతి ఎస్. అగోరమ్ నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం, ఆర్తూర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ సమకూర్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X