'రోబో' క్లైమాక్స్ సెట్స్ ఎలా,ఎక్కడ...సాబు సిరిల్
'రోబో' క్లైమాక్స్ గురించి ఇప్పుడు మాట్లాడనివారు లేరు. ఆ ఎఫెక్టు రావటానికి తాము పడిన శ్రమ గురించి కళాదర్శకుడు సాబు సిరిల్ చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే...'రోబో' క్లైమాక్స్ సన్నివేశాలు కోసం చెన్నయ్ శివారు ప్రాంతంలో గల మాయాజాల్ సమీపంలో ఒక తారు రోడ్డు, దాదాపు 65 అడుగులు ఎత్తున్న హైటెక్ గ్లాస్ భవనాలతో కూడిన భారీ సెట్ ను మేం నిర్మించాం. సినిమాలో అత్యంత ఖరీదైన సెట్‌లలో అది ఒకటి. ఈదురు గాలులు వీస్తుండటంతో అలాంటి భారీ సెట్టింగులు రూపొందించటానికి నానా తంటాలు పడ్డాల్సి వచ్చింది..ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఆ కష్టమంతా మరిచిపోతున్నాం అని సాబు వివరించారు.
అలాగే..."ఏ సినిమాకైనా సరే సెట్లనేవి చిత్ర కథలో భాగంగా ఉండాలని నేను నమ్ముతాను. మేం ఏమేరకు కష్టపడ్డామనేది, ఎంత శక్తిని వినియోగించామనేది 'రోబో' చిత్రం చూసిన తర్వాతనే ఎవరికైనా అర్ధమవుతుంది" అని సాబు సిరిల్ చాలా కాన్ఫిడెంట్ తో చెప్పారు. నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఎదుర్కొన్న అతి పెద్ద సవాల్ ఏదైనా ఉందంటే అది 'రోబో' చిత్రమే అని ఆయన అన్నారు. శాబు గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'బాయ్స్' 'అపరిచితుడు' చిత్రాలకు కళాదర్శకుడిగా పనిచేశారు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ హీరోగా హిందీలో రూపొందిస్తున్న 'రావన్' ైన్స్ ఫిక్షన్ సినిమాకు ఆయన పనిచేస్తున్నారు.


Click it and Unblock the Notifications











