మాస్టర్ యూనిట్‌లో విషాదం... గుండెపోటుతో కీలక నటుడు మృతి...
సినీ పరిశ్రమను కరోనావైరస్ అనేక రకాలు బాధించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే సినీ దిగ్గజాలు నింగికి ఎగిశారు. ప్రేక్షకులను విషాదంలో ముంచెత్తి తిరిగి రాని లోకాలకు వెళ్లిన వారిలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రిషి కపూర్, నిషికాంత్ కామత్, సరోజ్ ఖాన్ రాక్‌లైన్ సుధాకర్, చిరంజీవి సర్జా, బసు చటర్జీ, వాజిద్ ఖాన్, నిమ్మి తదితరులు ఉన్నారు. ఇలాంటి విషాద వార్తలు తేరుకోక ముందే తమిళ చిత్ర పరిశ్రమ ఓ నటుడిని కోల్పోయింది.
తమిళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టు అరుణ్ అలెగ్జాండర్ డిసెంబర్ 28వ తేదీన గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 48 సంవత్సరాలు. అరుణ్ మరణ వార్తను మాస్టర్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధృవీకరించారు. మీరు ఇంత త్వరగా ఈ లోకం వీడుతారని కలలో కూడా ఊహించలేదు. నా కళ్లలో నుంచి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోతున్నాను. నీ లోటు ఎవరూ తీర్చలేదు. ఎప్పుడూ నా హృదయంలో చిరకాలం ఉంటారు అని లోకేష్ కనకరాజ్ తెలిపారు.

అరుణ్ అలెగ్జాండర్ విషయానికి వస్తే.. తమిళ చిత్ర పరిశ్రమలో కొలమావు కోకిల, ఖైదీ, బిజిల్ లాంటి చిత్రాలతోపాటు త్వరలో విడుదల కానున్న మాస్టర్ చిత్రంలో పనిచేశారు. ఖైదీ చిత్రంలో విలన్ పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.


Click it and Unblock the Notifications











