రజనీ 'అరుణాచలం'లో నటించిన కోతి మృతి

ఆ సినిమాలో బస్సులో కూర్చుని ఉన్న రజనీకాంత్ మెడలోని రుద్రాక్షను లాక్కుని వెళ్లే సన్నివేశంలో ఈ వానరం నటించింది. ఈ సన్నివేశం కథలో కీలక ఘట్టంగా కావడం విశేషం. ఈ వానరాన్ని 2006లో గోవిందన్ కుమారుడు నెహ్రు సేలం కురుమపట్టి జూకు అప్పగించారు. అప్పటినుంచి ఈ వానరాన్ని జూ అధికారులు సంరక్షించారు.
33 ఏళ్ల వయస్సు గల ఈ వానరం గత నాలుగురోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం మృతి చెందింది. ఈ విషయం తెలియగానే జూకి చేరుకున్న స్థానికప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. వానరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం సేలం వెటర్నరి ఆసుపత్రికి తరలించారు.


Click it and Unblock the Notifications











