కార్తీక్ నరేన్ మరో నైట్ శ్యామలన్.. అరవింద్‌స్వామి ప్రశంసలు
దక్షిణాది నటుడు అరవింద్ స్వామి వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన నటించిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొంటున్నది. తాజాగా ఆయన నటించిన నరకాసురుడు అనే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల మీడియాతో అరవిందస్వామి మాట్లాడుతూ.. కార్తీక్ నరేన్‌ను హాలీవుడ్ దర్శకుడు మనోజ్ నైట్ శ్యామలన్‌తో పోల్చడం తమిళ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కార్తీక్‌కు తమిళ చిత్ర పరిశ్రమ సహకారం అందించి సరైన మార్గంలో నడిపిస్తే కోలీవుడ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లగల సమర్ధత ఆయనలో ఉంది అని అన్నారు.



Click it and Unblock the Notifications











