నిర్మాతతో వివాదం.. కోర్టుకెక్కిన రాంచరణ్ విలన్!
Recommended Video

ఒకప్పుడు ప్రేమ కథలు, రొమాంటిక్, ఎమోషనల్ చిత్రాలతో నటుడు అరవింద స్వామి అలరించాడు. ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం కీలక పాత్రలు చేస్తూనే క్యారెక్టర్ రోల్స్ లో కూడా అరవిందస్వామి నటిస్తున్నాడు. తని ఒరువన్ చిత్రంలో విలన్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. తెలుగు రీమేక్ రాంచరణ్ ధృవ చిత్రంలో కూడా అరవింద స్వామే విలన్. ఇందులో అరవింద స్వామి పాత్ర హైలైట్ గా నిలిచింది. నిర్మాతతో ఏర్పడ్డ వివాదంతో అరవింద స్వామి కోర్టుకెక్కిన వార్త తాజాగా వెలుగులో వచ్చింది.

మనోబాల
ప్రముఖ హాస్య నటుడు మనోబాల నిర్మాణంలో 2014 లో చతురంగ వెట్టై చిత్రం వచ్చింది. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. దీనితో ఆ చిత్రానికి సీక్వెల్ చతురంగ వెట్టై 2 ని కూడా ఆయనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అరవింద స్వామి, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ నెలలోనే విడుదల
చతురంగ వెట్టై చిత్రం అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకుని సెప్టెంబర్ 22 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సమయంలో అరవింద స్వామి నిర్మాత మనోబాలపై చెన్నై హైకోర్టులో ఫిటిషన్ వేయడం సంచలనంగా మారింది.

వివాదానికి కారణం
ఈ చిత్ర పారితోషకాన్ని అరవిందస్వామికి మనోబాల ఇంకా ఇవ్వలేదట. దీనితో వీరి మధ్య వివాదం చెలరేగడంతో అరవింద స్వామి హైకోర్టుని ఆశ్రయించారు. సినిమా విడుదల దగ్గరపడుతున్న సమయంలో అరవింద స్వామి కోర్టుకు ఎక్కడంతో చతురంగ వెట్టైపై సందిగ్దత నెలకొంది.

పారితోషకం చెల్లించే వరకు
తనకు మనోబాల 1.79 కోట్లు చెల్లించాల్సి ఉందని అరవిందస్వామి పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ మొత్తం చెల్లించేవరకు సినిమా విడుదల ఆపేయాలని కోర్టుని కోరాడు. అరవిందస్వామి పిటిషన్ తో కోర్టు మనోబాలకు నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇస్తూ మరో పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది.


Click it and Unblock the Notifications











