twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంపేయాలనే కొత్త ఫ్యాషన్‌ మొదలైంది: హిందూత్వ వాదుల పై అరవింద్ స్వామి ఆగ్రహం

    హిందూ తీవ్రవాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన హీరో కమల్ హాసన్‌ను కాల్చి చంపాలి లేదా ఉరి తీయాలంటూ హిందూ మహాసభ నేత చేసిన వ్యాఖ్యలను మరో హీరో అరవింద్ స్వామి ఖండించారు.

    |

    హిందూ తీవ్రవాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన హీరో కమల్ హాసన్‌ను కాల్చి చంపాలి లేదా ఉరి తీయాలంటూ హిందూ మహాసభ నేత చేసిన వ్యాఖ్యలను మరో హీరో అరవింద్ స్వామి ఖండించారు. ఈ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. గొంతెత్తితే కాల్చేస్తారా అంటూ ప్రశ్నించారు.

    హిందూ ఉగ్రవాదం

    హిందూ ఉగ్రవాదం

    దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందంటూ విలక్షణ నటుడు కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కమల్ ను కాల్చి చంపినా తప్పులేదంటూ అఖిల భారతీయ హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు అశోక్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు కూడ చేశారు. కమల్ పై క్రిమినల్, పరువునష్టం కేసు పెట్టాలన్న పిటిషన్ ను వారణాసి కోర్టు విచారణకు కూడా స్వీకరించింది.

     రాజకీయ రంగ ప్రవేశం

    రాజకీయ రంగ ప్రవేశం

    త్వరలో రాజకీయ రంగ ప్రవేశం అంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ బీజేపీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోందన్నారు. దేశంలో హిందూ టెర్రర్ లేదని ఎవరూ చెప్పలేరని స్పష్టం చేశారు.

    అరవింద్ స్వామి స్పందించాడు

    అరవింద్ స్వామి స్పందించాడు

    హిందూ ఉగ్రవాదం ఉందన్న విషయాన్ని అతివాదులు అంగీకరించి తీరాల్సిందేనన్నారు. ‘ఆనంద వికటన్' అనే తమిళ మ్యాగజైన్‌కు ప్రతి వారం రాసే కాలమ్‌లో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇదే అంశంపై "రోజా" చిత్రం హీరో అరవింద్ స్వామి స్పందించాడు. కమల్ కి మద్దతుగా తానూ గొంతెత్తాడు ..

     కొత్త ఫ్యాషన్‌ మొదలైంది

    కొత్త ఫ్యాషన్‌ మొదలైంది

    'ప్రశ్నిస్తే, జాతి వ్యతిరేకులమంటూ జైల్లో వేయాలంటున్నారు. ఒకవేళ జైళ్లు ఖాళీ లేకపోతే కాల్చి చంపేయాలనే కొత్త ఫ్యాషన్‌ మొదలైంది' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కమల్ కు ప్రముఖ సినీ నటుడు అరవిందస్వామి మద్దతుగా నిలిచారు. చట్ట విరుద్ధంగా బెదిరింపులకు, హింసకు పాల్పడేవారిని ఉగ్రవాదులు కాక మరేమని పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. 'మెర్సల్' సినిమాకు కూడా మద్దతు పలికారు.

    English summary
    Actor Arvind Swami has also extended his support to Kamal haasan., "Earlier Arvind Swami had posted, "Terrorist definition a person who uses unlawful violence and intimidation, especially against civilians, in the pursuit of political aims."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X