ఎంజీఆర్ లుక్ వైరల్.. అరవింద్ స్వామి అదరగొట్టేశాడు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమిళ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కమల్ హాసన్ తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తమిళ రాజకీయాల్లో బిజీ కావడానికి సిద్ధమయ్యారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి తమిళ్ పాలిటిక్స్ ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేపుతున్నాయి. ఇదే క్రమంలో జయలలిత బయోపిక్ రూపొందుతుండడం హాట్ టాపిక్ గా మారింది.

కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ పాత్ర యొక్క లుక్కును విడుదల చేశారు. సినీ నటుడు తమిళ రాజకీయ నాయకుడు ఎం.జి.రామచంద్రన్ (ఎంజిఆర్) లుక్ ఒకటి రిలీజ్ అయ్యింది. ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఎంజీఆర్ మరణించిన రోజు కావడంతో స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Arvind Swami Thalaivi Stills On Death Anniversary

అరవింద్ స్వామీ ఎంజీఆర్ పాత్రకు కరెక్ట్ గా సరిపోయాడని అనిపిస్తోంది. తెల్లటి చొక్కా ధరించి, ఎంజిఆర్ ట్రేడ్‌మార్క్ బ్లాక్ షేడ్స్ ధరించి, అరవింద్ స్వామి తన పార్టీ సభ్యులకు నమస్కరం చేస్తున్నట్లు ఉంది. బాడీ లాంగ్వేజ్ కూడా MGRకి చాలా దగ్గరగా కనిపిస్తుంది. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఏఎల్.విజయ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. ఇక సినిమాను త్వరలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X