చిరు కోసం అరవింద్ స్వామి.. సైరాలో సడెన్ ఎంట్రీ.. రాంచరణ్ జాదూతో..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. తొలి స్వతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీపై అంచనాలు ఆకాశన్నంటాయి. దాదాపు 300కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మూవీని మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ప్యాన్‌ఇండియా మూవీగా..
బాహుబలి ఇచ్చిన ధైర్యంతో టాలీవుడ్‌లో మూవీ బడ్జెట్ పెరిగిపోయింది. హాలీవుడ్ స్థాయి చిత్రాలను తెరకెక్కించేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. దీనిలో భాగంగా సాహో, సైరా లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు టాలీవుడ్‌లో పురుడుపోసుకున్నాయి. అయితే సాహో అనుకున్నంతగా టాక్ రాకపోయినా.. కలెక్షన్ల పరంగా కనకవర్షం కురిపించింది. ఇక ప్రస్తుతం సైరా వంతు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీపై భారీ హైప్ ఏర్పడింది.

తమిళలో డబ్బింగ్ చెప్పిన హ్యాండ్సమ్ హీరో..
ధృవ సినిమాతో అరవింద్ స్వామి, రామ్ చరణ్‌లకు మంచి స్నేహం ఏర్పడింది. అయితే ఈ స్నేహబంధంతో సైరాలో తనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని రామ్ చరణ్‌ను అరవింద్ స్వామి అడిగాడట. తమిళ్ నుంచి విజయ్ సేతుపతికి ఫోన్ చేస్తావ్ కానీ నాకు ఎందుకు చేయలేదంటూ సరదాగా అన్నాడంటా. తనకు చాన్స్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడట. సినిమా కూడా పూర్తి కావాల్సి వచ్చింది.. డబ్బింగ్‌కూడా పూర్తయిందని రామ్ చరణ్ చెప్పాడట.

చిరుకు డబ్బింగ్ చెప్పే అవకాశమివ్వమని అడిగాడట..
అయితే తనకు డబ్బింగ్ చెప్పడంలోప్రావీణ్యం ఉందని చెప్పడానికి ఉదహరణగా.. షారుఖ్ ఖాన్ సినిమాకు కూడా డబ్బింగ్ చెప్పినట్లు అరవింద్ స్వామి తెలిపాడు. అయితే ఆ డబ్బింగ్ చూసిన రామ్ చరణ్ ఆశ్చర్యానికి గురై.. వెంటనే చిరుతో మాట్లాడట. చిరు కూడా ఓకే అనేసరికి రెండు రోజుల్లోనే డబ్బింగ్‌ను పూర్తి చేశాడని తమిళ ప్రమోషన్ కార్యక్రమంలో రామ్‌చరణ్ చెప్పుకొచ్చాడు. అదీ తమిళ హీరోలంటే.. సైరాకు తమిళ ఇండస్ట్రీ బాగా సహకరిస్తోంది, అందుకు ధన్యవాదాలు అని అన్నారు.

సైరా విడుదలకు సమయం
సైరా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో..సినిమా యూనిట్ క్షణం తీరిక లేకుండా బిజిబిజీగా ఉంది. చిరంజీవి, రామ్ చరణ్‌లు సినిమాను ప్రమోట్ చేసే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, లేడీ సూపర్‌స్టార్ నయనతార, మిల్కీ బ్యూటీ తమన్నాలాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీని అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











