సమస్యని అడ్డుపెట్టుకుని పబ్లిసిటీ.. చిన్మయి వివాదం, అరవింద్ స్వామి సంచలన వ్యాఖ్యలు!
హాలీవుడ్ లో మొదలైన మీతో ఉద్యమం తనుశ్రీ దత్త చేసిన వ్యాఖ్యలతో బాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. మీటూ ఉద్యమంతో బాలీవుడ్, కోలీవుడ్ లోని చాలా మంది సినీ ప్రముఖుల అసలు బండారం బయటపడింది. హీరోయిన్లని వేధింపులకు గురిచేసిన సినీప్రముఖులని చాలా చిత్రాలనుంచి తొలగించారు కూడా. తాజా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు అరవిందస్వామి మీటూ ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒకరు వ్యక్తిగతంగా ఎదుర్కొన్న ఆరోపణనలు, సమస్యల గురించి నా స్పందన ఎందుకు అడుగుతున్నారని అన్నారు.

ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా
ప్రస్తుతం ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అందుబాటులో ఉంది. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పొచ్చు. ఆ అవకాశం, హక్కు రెండూ ఉన్నాయి అని అరవింద్ స్వామి అన్నారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని, ఒక సమస్యని అడ్డు పెట్టుకుని పబ్లిసిటీ పొందాలని ఆడుకోకూడదు. వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక నటుడు నాయకత్వం వహించాలని ఎందుకుఅనుకుంటున్నారు అని అరవింద్ స్వామి వ్యాఖ్యానించారు.

చిన్మయి వివాదం
అరవింద్ స్వామి చిన్మయి, వైరముత్తు వివాదం గురించి స్పందించారు. అవి ఒక వ్యక్తిపై చేయబడ్డ ఆరోపణలు. ఆ విషయంలో చిన్మయికి తగినంత సపోర్ట్ లభించకపోయి ఉండవచ్చు. ఆమెని కూడా కొందరువ్యతిరేకించి ఉండవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తిపై ఆరోపణలు జరిగినప్పుడు.. నేను కూడా అతడిని నిందించాలి అంటే నాకు తగినంత సమాచారం తెలియాలి. కేవలం ఒక ఆరోపణ ఆధారంగా నేనెలా అతడిని తిట్టగలను అని అరవింద్ స్వామి అన్నారు.

ప్రతి ఒక్కరూ అదేవిధంగా
కానీ ఊహించని విధంగా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగానే ఆరోపణలు చేస్తున్నారని అరవింద్ స్వామి అన్నారు. బాలీవుడ్ లో నానా పాటేకర్, వికాస్ బహల్ లాంటి ప్రముఖులు మీ టూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తమిళంలో చిన్మయి.. వైరముత్తు పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

మొదలుపెట్టిన తనుశ్రీ దత్త
తనుశ్రీ దత్త కొన్ని నెలల క్రితం బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పాటేకర్ పై చేసిన ఆరోపణల కారణంగా ప్రస్తుతం ఇండియాలో మీటూ ఉద్యమం గురించి చర్చ జరుగుతోంది. ఓ చిత్ర షూటింగ్ లో భాగంగా నానా పాటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ దత్త ఆరోపించింది. ఈ వివాదం పెద్దగా మారి మీటూ ఉద్యమంగా మారింది.


Click it and Unblock the Notifications











