‘వరుడు’ ని చుట్టుముట్టిన మరో వివాదం!
ఆ మద్య 'ఏ మాయ చేసావె" కి తనకు ఇస్తానన్న రెమ్యూనరేషన్ ఇవ్వకుండా నిర్మాత మంజుల మోసం చేసిందని తమిళ మీడియాకెక్కిన దర్శకుడు గౌతమ్ మీనన్ గొడవ చేశాడు. ఇప్పుడు తాజాగా మరో తమిళ నటుడు తెలుగు నిర్మాత తనకు ఇస్తానన్న డబ్బులివ్వలేదని కంప్లయింట్ ఇచ్చాడు. 'వరుడు" లో విలన్ గా నటించిన ఆర్య కి ఒప్పందం చేసుకున్న మొత్తాన్ని నిర్మాత దానయ్య ఇవ్వలేదంట. దాంతో ఈ విషయాన్ని నదిగర్ సంఘంలో పెట్టాడు ఆర్య. సంగం అధ్యక్షడు శరత్ కుమార్ జోక్యం చేసుకొని ఆర్యకు రావాల్సిన బకాయిలను ఇప్పించాడట. మొత్తమ్మీద తమిళ నటులు, దర్శకులు ఇక్కడ సినిమాలు చేస్తే డబ్బులొస్తాయో రావోనని భయపడే పరిస్థితి కనిపిస్తోంది.
వరుడు అల్లు అర్జున్ దానయ్య శరత్ కుమార్ గౌతమ్ మీనన్ మంజుల ఆర్య varudu allu arjun danaya sarath kumar gowtham menon manjuala arya


Click it and Unblock the Notifications