అనుష్కతో క్లోజ్ అంతే...ఆ సంబంధం లేదని ఖండన
చెన్నై : విలన్ గా తెరంగేట్రం చేసి ప్రధానపాత్రధారిగా హవా చాటుకుంటున్న నటుడు ఆర్య. తాజాగా ఆయన అనుష్కతో రిలేషన్ ఉందని సంభంధం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన మీడియా వద్ద ఖండించారు. ఆర్య,అనుష్క కాంబినేషన్ లో సెల్వ రాఘవన్ తో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ నేపధ్యంలో ఈ వార్త ఊపందుకుంది.
ఈ విషయమై ఆర్య మాట్లాడుతూ.... హీరోయిన్స్ తో నేను సరదాగా మాట్లాడుతుంటాను. అది నా వ్యక్తిత్వం. ఆ మాత్రానికే వారితో సంబంధాలు కలిపేయడం సమంజసం కాదు. నయనతార, అనుష్క నాకు మంచి స్నేహితులు. వారితో కలసి వదంతులు వినిపిస్తున్నాయి. అవన్నీ నిజం కావు. ఇలాంటివి నమ్మి వారి స్నేహాన్ని వదులుకోనని తెలిపాడు.
ఆర్య ... ఓరంపో, పట్టియల్, మదరాసపట్టినం, బాస్ వంటి చిత్రాలతో ప్రత్యేకస్థానం సంపాదించుకున్నాడు. తాజాగా ఓ చిత్రంలో నయనతారతో ఆడిపాడుతున్నాడు. ఆర్య ఏ సినిమాలో నటించినా అందులో హీరోయిన్ తో ముడిపెట్టి వదంతులు రావడం పరిపాటిగా మారింది. నయనతారతో,అనుష్క తో కలిసి షికార్లు చేస్తున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications












