నయనతార తో ప్రేమా..? నవ్వేసాడు
దానికి తోడు ఇటీవల ఆర్య గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. నయనతార హాజరయ్యారు. అప్పుడు 'వెల్‌కమ్ బ్యాక్ నయనతార' అని రాసిన ఓ కేక్‌ని ఆమెతో కట్ చేయించారు. అలాగే అజిత్, ఆర్య కలసి నటిస్తున్న ఓ చిత్రంలో నయన్ నటించడానికి ఒప్పుకొన్నారు. నయనతార మరోసారి ప్రేమలోపడ్డారా..? అని ఓ టీవీ ఛానెల్ ఓ ప్రత్యేకమైన పోగ్రాం చేసింది. ఈ కేక్ క్లిప్పింగ్ లు చూపుతూ. అది హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ విషయమై ఆర్య స్పందిస్తూ ''నయనతార, నేను మంచి స్నేహితులం. ఇద్దరం బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రంలో నటించాం. మా మధ్య ప్రేమ లేదు. ఆమె కొన్ని ఇబ్బందుల నుంచి తిరిగొచ్చారనే ఉద్దేశంతో కేకుపై అలా రాసి స్వాగతించాను. గృహ ప్రవేశ వేడుకకి నయనతారను మాత్రమే కాదు చాలామంది నటీనటులను కూడా ఆహ్వానించాను'' అన్నారు.
ప్రస్తుతం నయనతార తెలుగులో నాగార్జున,దశరధ్ కాంబినేషన్ లో ఓ చిత్రం కమిటైంది. అదికాక క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న కృష్ణం వందే జగద్గురంలోనూ ఆమె హీరోయిన్ గా చేస్తోంది. మరో రెండు తమిళ సినిమాలు సైతం ఆమె కమిటైంది. బాలకృష్ణ కూడా తను డైరక్ట్ చేద్దామనుకున్న నర్తన శాలలో ఆమెను హీరోయిన్ గా అడుగుతున్నాడు.


Click it and Unblock the Notifications












