డేట్ బుక్ చేసుకున్న నయనతార, ఆర్య!
చెన్నై: తమిళ హీరో ఆర్య, హాట్ హీరోయిన్ నయనతార మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆ మధ్య ఓ వార్త సంచలనం సృష్టించింది. పలు టీవీ ఛానల్స్ కూడా ఈ విషయంపై ప్రధానంగా ఫోకస్ చేశాయి. అయితే ఆ తర్వాత అదంతా వారి తాజా సినిమా 'రాజారాణి' ప్రచారం నిమిత్తం ఆడిన డ్రామా అని తేలింది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈచిత్రం విడుదల కానుంది.
కాగా...'రాజా రాణి' సినిమాకు డేట్ బుక్ అయింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27 లేదా సెప్టెంబర్ 29 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపు ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈచిత్రానికి క్లీన్ 'U' సర్టిఫికెట్ జారీ చేసింది.
ఈ చిత్రాన్ని మురుగదాస్ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అత్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పెళ్లి తర్వాత జంటల మధ్య జరిగే తీయటి సంఘటనలను ప్రధానంగా ఫోకస్ చేయనున్నారట. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...'రాజా రాణి చిత్రం ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్, పెళ్లి తర్వాతి తీయని జీవితాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నాం' అని వెల్లడించారు.
ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉందని తెలిపారు. ఆర్య, నయనతార పెళ్లయిన జంటగా పర్‌ఫెక్టుగా నటించారు, వారి మధ్య సినిమాలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రంలో ఆర్య, నయనతార, జై, సంతానం, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications












