Don't Miss!
- News తారకరత్న భార్య బిగ్ ట్విస్ట్ ..ఆ పార్టీకే మద్దతంటూ ప్రకటన
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
యంగ్ హీరోయిన్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్.. తమిళ హీరోతో డేటింగ్!
చిత్ర పరిశ్రమలో సెలెబ్రిటీల మధ్య ప్రేమ వ్యవహారాలు ఎపుడూ జరుగుతూనే ఉంటాయి. అందులో కొన్ని జంటలు మాత్రమే వివాహ బంధంతో ఒక్కటవుతుంటారు. చిత్ర పరిశ్రమలోకి వచ్చి మూడేళ్లు కూడా కాలేదు. అప్పుడే ఓ యంగ్ బ్యూటీ ప్రేమ వ్యవహారాలు సాగించి పెళ్లి వరకు వచ్చేసింది. తమిళ హీరో ఆర్య, యంగ్ హీరోయిన్ సయేశా సైగల్ త్వరలో పెళ్ళికి సిద్ధం అవుతున్నారు. ఆర్య తమిళంలో హీరోగా రాణిస్తున్నాడు. సాయేషా సైగల్ కెరీర్ ఇప్పడే ఆరంభంలో ఉంది. ఇంతలోనే ఈ భామ పెళ్ళికి సిద్ధం అవుతుండడం ఆసక్తి రేపుతోంది.
ఆ చిత్రమే కలిపింది
సాయేషా సైగల్, ఆర్య తమిళ చిత్రం గజినీకాంత్ లో నటించారు. ఈ చిత్రం ద్వారా ఏర్పడిన పరిచయమే వీరి మధ్య ప్రేమగా మారింది. గజినీకాంత్ చిత్రంతో సాయేషా, ఆర్య మధ్య రొమాన్స్ తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. సాయేషా సైగల్ అయితే అందాల ఆరబోతలో రెచ్చిపోయి నటించింది. అంతా ఊహించినట్లుగానే వీరిద్దరూ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పెళ్లి ముహూర్తం ఫిక్స్
సాయేషా, ఆర్య పెళ్ళికి ముహూర్తం ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి 9, 10 తేదీల్లో హైదరాబాద్ ఓ వీరి వివాహం ఘనంగా జరుగబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖుల్ని, సెలెబ్రిటీలని రిసెప్షన్ కోసం ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఆర్య, సాయేషా మధ్య వయసు వ్యత్యాసం కూడా ఎక్కువగానే ఉంది. ఆర్య వయసు 38 ఏళ్ళు. కాగా సాయేషా వయసు కేవలం 21 ఏళ్ళు మాత్రమే. ఇద్దరి మధ్య 17ఏళ్ల వ్యత్యాసం ఉంది.
తెలుగులో ఒక్కటి మాత్రమే
సాయేషా సైగల్ అఖిల్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ చిత్రంలో సాయేషా గ్లామర్, డాన్సులకు మంచి మార్కులు పడ్డాయి. కానీ సినిమా విజయం సాధించకపోవడంతో టాలీవుడ్ లో సాయేషాకు మరో అవకాశం రాలేదు. తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించింది. సోషల్ మీడియాలో సాయేషా గ్లామర్ కు, డాన్సులకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. సాయేషా తరచుగా తన వీడియోల్ని అభిమానులతో పంచుకుంటుంది.
సూర్య పాటకు హీరోయిన్ పిచ్చి పిచ్చిగా డ్యాన్స్
తెలుగువారికి పరిచయమే
ఇక హీరో ఆర్య కూడా తెలుగు ఆడియన్స్ కు పరిచయమే. ఆర్య నటించిన రాజా రాణి చిత్రం మంచి విజయం సాధించినది. అనుష్క నటించిన సైజ్ జీరో, వర్ణ లాంటి చిత్రాల్లో ఆర్య నటించాడు. ప్రస్తుతం ఆర్య, సాయేషా ఇద్దరూ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కప్పాన్ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ జంట వివాహానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.