వడ్డీలు కట్టలేక ఆర్యన్ రాజేష్ ఇబ్బందులతో...

By Srikanya

చెన్నై : ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ ..హీరోగా తెలుగులో క్లిక్ కాలేకపోయారు. అయితే ఆయనకు తమిళంలో మాత్రం ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయన తమిళంలో చేసిన 'దుడ్డు' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. వడ్డిలు కట్టలేక కష్టాలు పడే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. 'పార్వై ఒండ్రో పోదుమే', 'పేసాద కన్నుం పేసుం' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మురళీకృష్ణన్‌ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా 'దుడ్డు'. ఆయనే సంగీతం సమకూర్చుతున్నారు. తెలుగులో సైతం ఈ చిత్రం విడుదల అయ్యే అవకాసం ఉంది.

దర్శకుడు మురళీ కృష్ణన్‌ మాట్లాడుతూ ... వడ్డీ సమస్యతో ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడ్డాయి. రోజూ పత్రిక తిరగేస్తే ఇలాంటి విషాదాలు ఎన్నో కనిపిస్తాయి. అలాంటి ఓ యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. కొందరు ధనవంతులు బ్యాంకుల్లో తక్కువ వడ్డీలకు రుణాలు తీసుకుని వారికి మస్కా కొడుతున్నారు. పేదలు కందువడ్డీకి రుణాలు తీసుకుని.. వాటిని కట్టలేక, అప్పు ఇచ్చినవాడి దాడులను తట్టుకోలేక చివరకు మరణమే శరణ్యమనుకుంటున్నారు. ఈ వాస్తవంతోపాటు కాస్త ప్రేమ, హాస్యాన్ని కలగలిపి జనం ముందుకు తెస్తున్నామన్నారు. ముంబయి మోడల్‌ సోనాచోప్రా హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఆ మధ్యన శ్రీహరి, ఆర్యన్ రాజేష్, శ్రద్దాఆర్య ప్రధాన పాత్రల్లో రూపొందించిన 'బాలరాజు ఆడి బామ్మర్ధి'విడుదలై పత్తా లేకుండా పోయింది. ఇక ఈ సంవత్సరంలోనే ఆర్యన్ రాజేశ్ ఓ ఇంటివాడయ్యాడు. జేగురుపాడుకు చెందిన కంటిపూడి ఆమర్‌నాధ్ కుమార్తె సుభాషిణిని మనువాడాడు. రాజమండ్రి చెరుకూరి కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకలకు సినీ,రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఆర్యన్ రాజేష్ సోదరుడు నరేష్ మాత్రం కామెడీ చిత్రాలతో దూసుకుపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X