ఆసిన్ ఆ సినిమాలు తప్ప వేరేవి రావా?

By Srikanya

ఆసిన్ కెరీర్ ఇక పరిసమాప్తి అయిపోందని అందరూ అనుకున్న సమయంలో వరసగా మూడు చిత్రాల్లో బుక్ అయి షాక్ ఇచ్చింది. అయితే మరో ట్విస్ట్ ఏమిటంటే గజనీ రీమేక్ లో చేయటం వలనో ఏమో గానీ ఆ మూడూ చిత్రాలు రీమేక్ లే కావటం విశేషం. అందులో మొదటిది అనీష్ బజ్మీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ సరసన చేస్తున్న చిత్రం. అది తెలుగులో రవితేజ హీరోగా వచ్చి హిట్టయిన కిక్ కి రీమేక్. అందులో ఇలియానా చేసిన క్యూట్ గర్ల్ పాత్ర ని ఆసిన్ చేస్తోంది. ఇక జాన్ అబ్రహమ్ సరసన ఓ చిత్రం చేస్తోంది. అది తమిళంలో హిట్టయిన కాక కాక రీమేక్. ఆ రీమేక్ తెలుగు వెర్షన్ ఘర్షణలో వెంకటేష్ సరసన ఆమె చేసిందన్న సంగతి తెలిసిందే. వీటికి తోడు ఆమె తమిళంలో విజయ్ సరసన కావాలకరన్ అనే చిత్రంలో బుక్కయింది. అది మళయాళంలో సూపర్ హిట్టయిన బాడీ గార్డ్ అనే చిత్రానికి రీమేక్. అందులో నయనతార చేసిన పాత్రను ఆసిన్ పోషిస్తోంది. ఇంతకుముందు కూడా ఆసిన్ విజయ్ సరసన పోకిరి రీమేక్ లో హీరోయిన్ గా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X