ప్లైట్ పట్టుకోవటానికి ఎడ్లబండి ఎక్కిన అసిన్
ముంబై ప్లైట్ అందుకోవటానికి మధురై ఎయిర్ పోర్ట్ కు బయిలుదేరిన అసిన్ ఎడ్లబండిలో ప్రయాణం చేసి అందరికీ ట్విస్ట్ ఇచ్చింది. అసిన్ కి బాగా దగ్గరవాళ్ళు చెప్పిన దాని ప్రకారం...కరైకుడి నంచి మధురై ఎయిర్ పోర్ట్ కు రెండు గంటలు జర్నీ. అసిన్ తన ముగ్గురు స్నేహితురాళ్ళతో కలసి బయిలుదేరింది. మధ్యలో వారికో ఎడ్లబండి కనిపించింది. ఆమె స్నేహితులు ఆటపట్టించటానికి నువ్వు ఎడ్లబండిలో ప్రయాణం చేసి రాగలవా అని ఛాలెంజ్ చేస్తే..ఆమె తడుముకోకుండా ఓకే చేసింది. ప్రయాణిస్తున్న కారుని రోడ్డుకి ఓ ప్రక్కగా ఆపి అసిన్ దూకి ఎడ్లబండిని ఆపుచేసింది. ఆమె రోడ్డుపై హఠాత్తుగా చూసిన ఎడ్లబండి అతను ఆమె ఫొటోలు తీసుకోవటానికి వస్తోందని ఆపుచేసాడు. అయితే అసిన్ అందులోకి ఎక్కి ఎయిర్ పోర్ట్ కు పోనివ్వమంది. కంగారుపడ్డ ఆమె స్నేహితురాళ్ళు కూడా అసిన్ ని అనుసరించారు. అందులోనూ ప్లైట్ లేటని కనుక్కోవటంతో టెన్షన్ లేకుండా ప్రయాణం కూల్ గా సాగిందంటున్నారు. దాదాపు ఇరవై ఐదు నిముషాల పాటు ఎడ్లబండి లో అసిన్ ప్రయాణం చేసి ఎయిర్ పోర్ట్ ని చేరుకుంది. ఎయిర్ పోర్ట్ ఎదురుగా ఆమె ఎడ్లబండినుంచి దిగటం చూసిన చాలా మంది షాక్ అయిపోయారు. ఇక అసిన్ ప్రస్తుతం తమిళంలో విజయ్ సరసన బాడీగార్డ్ రీమేక్ లో చేస్తోంది. ఒరిజనల్ డైరక్ట్ చేసిన సిద్దిక్ దీనిని డైరక్ట్ చేస్తూండటం విశేషం.


Click it and Unblock the Notifications











