గాయాలతో అసిన్

By Staff

గజనీతో ఒక్కసారిగా స్టార్ డమ్ ఇమేజ్ తెచ్చుకున్న అసిన్ గాయపడింది. నైంటీన్త్ స్టెప్ అనే తమిళ సినిమా నిమిత్తం ఆమె కేరళలో 'కలరియపట్టు' అనే మర్మ కళ ప్రాక్టీస్ చేస్తూండగా గాయపడింది. కుడి కాలికి తగిలిన బలమైన గాయం వల్ల కాలు బాగా వాచిపోయింది. దాంతో ఆమె అడుగు తీసి అడుగు వేయలేకపోతోంది. అయితే ఆమె కొద్ది రోజుల్లో జరగనున్న ఫిల్మ్ అవార్డుల పంక్షన్ కి ర్యాంప్ వాక్ చెయ్యాల్సి ఉంది. కానీ ఇచ్చిన కమిట్ మెంట్ ప్రకారం అందులో పాల్గొంటానని,అందులోంచి వైదొలిగే ప్రశక్తే లేదని తేల్చిచెప్తోంది. ఇక ఈ నైంటీన్త్ స్టెప్ చిత్రాన్ని భారత్ బాలా అనే దర్శకుడు డైరక్ట్ చేస్తున్నాడు. వాల్ట్ డిస్ని వారు నిర్మిస్తున్నారు. ఇందులో అసిన్ ఓ రాకుమారి గా కనపడనుంది. అలాగే కమల్ హాసన్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రను చేస్తున్నారు.

అయితే ఆమె గాయానికి అల్లో పతి వైద్యం తీసుకోవటం లేదు. కేవలం ఆయుర్వేదం తో నెట్టుకొస్తోంది. ప్రస్తుతం ఆమె అంధేరి లోని గ్రీన్స్ ఏకర్స్ లోని సొంత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది.ఆమెను కలిసిన మీడియా వారితో కాలికి గాయం తగలడం, అలోపతి మెడిసన్ తీసుకోకపోవడం నిజమేనని ధ్రువీకరించింది. 'కృత్రిమమైన ఆహారం, స్పైసెస్ వంటివి తీసుకోవడం అలవాటులేని వాతావరణంలో చిన్నప్పటి నుంచి పెరిగాను. మా ఇళ్ళలో చక్కెరను వైట్ పాయిజన్ గా భావిస్తాం. అందుకు బదులుగా బెల్లం మాత్రమే వాడతాం. బయటి డ్రింకులు, చాకిలేట్లు, అలోపతి మెడిసన్లు ఎప్పుడూ తీసుకోను. ఆయుర్వేద చికిత్స మాత్రమే తీసుకుంటాను' అంటూ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X