మొదట బాధ..తర్వతే తృప్తి: అసిన్

By Staff

అసిన్ తన మనసులో భావనలు మీడియాతో వెళ్ళడించింది. తాజాగా ఆమె కేరళ ప్రాచీన విద్య అయిన కలరిపయట్టు నేర్చుకుంటున్న సందర్భంగా అందులో కష్టనష్టాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అసిన్ కేరళలో ఉంది. ఈ విధ్య నేర్చుకోవటం కోసం ఆమె కేరళలోని తిరువనంతపురం వెళ్ళింది. భారత్ బాల అనే తమిళ డైరక్టర్ డైరక్ట్ చేస్తున్న చిత్రం కోసం ఈ ట్రైనింగ్ కొనసాగుతోంది. 19th స్టెప్ పేరుతో ఈ చిత్రం రెడీ అవుతున్న ఈ చిత్రం ఈ ప్రాచీన కళ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. సాయింత్రాలు కూడా ఈ ట్రైనింగ్ కొనసాగుతోంది.

ఇక తన స్వంత ప్రాతం కేరళ కావటంతో ఆమెకు గురువు దొరకటం కష్టం కాలేదు. ఈ కలరిపయట్టు విధ్య తెలిస్తే ఒంటిచేత్తో పదిమందిని ఎదిరించవచ్చు. ఇక గజనీ అనంతరం పాపులర్ అయిన అసిన్ ప్రస్తుతం లండన్ డ్రీమ్స్ లో చేస్తూ అక్కడ సెటిల్డ్ హీరోయిన్స్ కు పోటీ ఇస్తోంది. అయితే అసిన్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొందరు పబ్లిసిటీ స్టంట్ గా పేర్కొంటున్నారు. అంత త్వరగా క్రాష్ కోర్స్ లా వచ్చే కళ కలరిపయట్టు అయితే ఇప్పటికీ అందరూ వెళ్ళి నేర్చుకునేవారుని విమర్శిస్తున్నారు. షూటింగ్ స్టేజిలో ఆసక్తి రేపటానికి అది అసిన్ చేసే ప్రయత్నం అంటున్నారు. అయితే వీటిపై అసిన్ ఏమీ స్పందించటం లేదు.

ఉదటం ఆరుగంటల నుండి మూడు గంటల సేపు ఆ ప్రాక్టీస్ చేస్తోంది. అయితే ఈ ట్రైనింగ్ వద్ద ఆమె మీడియాను దూరంగా పెట్టింది. అయితే ఓ లోకల్ పత్రికకు మాత్రం ఇంటర్వూ ఇచ్చింది. అందులో ఈ ట్రైనింగ్ చాలా బాధాకరంగా ఉందని, అయితే ఆ అనుభవం మాత్రం చాలా సంతృప్తికరంగా ఉందని చెప్తోంది. ఉదయాన్నే లేవటం, సముద్ర స్నానం చేయటం చేయటం ఆనందాన్ని ఇస్తోంది. ఇక ఈ ప్రాచీనవిద్య నా ఏటిట్యూడ్ ని సైతం మార్చేసింది. జీవితం పట్ల నా దృక్పధం మారింది. ఇక ఈ ట్రైనింగ్ లో ఇద్దరు గురువులు పాల్గొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X