మహేష్ బాబు చిత్రంలో అసిన్!
చెన్నై : అమ్మా నాన్న తమిళ అమ్మాయి, శివమణి లక్ష్మీ నరసింహా, ఘర్షణ వంటి చిత్రాలలో కనిపించి అలరించిన హీరోయిన్ అసిన్. తెలుగు సినిమాలలో టాప్ హీరోయిన్ గా వెలిగి,బాలీవుడ్ కి వలసి వెళ్లిపోయిన హీరోయిన్ అసిన్. అయితే అక్కడ సల్మాన్ వంటి స్టార్స్ తో చేసినా ఆమెకు కెరీర్ టర్న్ కాలేదు. ఆఫర్స్ మీద ఆఫర్స్ వచ్చి పడలేదు. అయితే తాజాగా ఆమె మహేష్ బాబు చిత్రంలో అవకాసం సంపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. మణిరత్నం దర్శకత్వంలో మహేష్ ,నాగార్జున కాంబినేషన్ లో అ చిత్రంలో ఆమెను తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఆమె నాగార్జున సరసన చేస్తుందా లేక,మహేష్ తో చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
'కడల్' పరాజయంతో తన కొత్త చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారట లెజండ్ దర్శకుడు మణిరత్నం. ఇందు కోసం పలు కథలపై కసరత్తు చేసిన ఆయన చివరకు ఒక్కదాన్ని ఎంపిక చేసుకున్నారట. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో దీన్ని రూపొందిస్తారట. హీరోలుగా నాగార్జున, మహేష్‌బాబు ఎంపికయ్యారని... ఆయా భాషల్లో మిగతా స్టార్లకు కూడా అవకాశం ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా హీరోయిన్ పాత్రకు తొలుత ఐశ్వర్యరాయ్ అనుకున్నా... ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో హీరోయిన్ అవకాశాన్ని అసిన్‌కు అప్పగించినట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగి 'గజిని'తో బాలీవుడ్ బాట పట్టి అక్కడా మెరిసిన అసిన్ ప్రస్తుతం ఖాళీగానే ఉంది. దీంతో మణిరత్నం అవకాశాన్ని అమ్మడు కూడా ఆనందంగా అంగీకరించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ ప్రారంభమైంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే
ఇక ఈ చిత్రంలో శృతిహాసన్ సెకండ్ హీరోయిన్ గా చేయనుంది. అయితే మహేష్,శృతి హాసన్ ఇంకా ఎగ్రిమెంట్ లోకి రాలేదు. మహేష్ బాబు కొన్ని సూచనలు చేసారని,ఆ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నట్లు వినికిడి. 2014 ఆగస్టు నుంచి ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాసం ఉంది. మద్రాస్ టాకీస్, వైజయింతీ మూవీస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ సినిమా ఒకేసారి తమిళం, తెలుగు భాషల్లో నిర్మితమవుతుంది. చర్చలు చేస్తున్నామని, మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో అన్నారు. నిజానికి, పొన్నియన్ సెల్వన్‌ను కథను తెరకెక్కించాలని మహేష్ బాబు, మణిరత్నం కలిసి అనుకున్నారు. కానీ ఎందువల్లనో అది ఆగిపోయింది. ఇది జరిగి దాదాపు రెండేళ్లవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది.
యుటివి మోషన్ పిక్చర్స్ బ్యానర్ మీద కొరటలా శివ సినిమాలో నటించడానికి కూడా మహేష్ బాబు అంగీకరించాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మణిరత్నం సినిమా ప్రారంభమవుతుందా, దాంతో పాటు ఈ సినిమాను మహేష్ బాబు చేస్తాడా అనేది తెలియడం లేదు.


Click it and Unblock the Notifications











