తిరుగు ప్రయాణం పెట్టుకున్న అసిన్ ..
అమీర్ ఖాన్ తో చేసిన 'గజిని' చిత్రం సంచలన విజయం సాధించటంతో బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని అసిన్ నిర్ణయం తీసుకుంది. అందుకు తగినట్లుగానే దక్షిణాది బాషల ఆఫర్స్ తిరగకొట్టింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'లండన్ డ్రీమ్స్' చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో అస్సలు ఆమెను అక్కడవారు పట్టించుకోవటం మానేసారు. అందులోనూ బాలీవుడ్ కి సరపడ గ్లామర్ ని ఆమె తెరపై పండించలేదంటూ కామెంట్స్ కూడా చేయటం మొదలు పెట్టారు. దాంతో ఆమె పరిస్ధితి డైలమోలో పడింది.
దాంతో అసిన్..ఎంతకాలం అలా ముంబయిలో ఆఫర్స్ లేకుండా వెయిట్ చేస్తామని ప్రస్తుతం చెన్నై వైపు తిరుగు ప్రయాణం పెట్టుకుందామని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే తనను ఆదరించిన తెలుగు,తమిళ పరిశ్రమలలో మళ్ళీ చేయాలనిపిస్తోందంటూ ఇంటర్వూలు ఇస్తోంది. తనను ఇప్పటికీ చెన్నైకి చెందిన నలుగురైదుగురు నిర్మాతలు సంప్రదిస్తున్నారని అంటోంది. అంటే త్వరలో ఆమె తమిళం సినిమాల్లో కనిపిస్తుందనేది నిజం అంటున్నారు. అయితే ఆమెకు పోటీగా అక్కడ త్రిష ఎంటరైంది. అయితే త్రిష తెలివిగా అటు తమిళ, తెలుగు సినిమాలు వదలకుండా చేస్తూనే హిందీలో ట్రై చేస్తోంది. అదే ధీరిని ఫాలో అవుదామని అసిన్ నిర్ణయించుకుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











