గజిని హిందీ వెర్షన్ లో అమీర్ ఖాన్ సరసన నటించిన ఆసిన్ ఇప్పుడు కమలహాసన్ తో నటించడానికి ఇష్టపడడం లేదట. గజిని సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆమెకు కమల్ హాసన్ సరసన దశావతారం సినిమాలో నటించే అవకాశం లభించింది. తమిళ సూపర్ స్టార్ తో నటించే అవకాశం అంత తొందరగా వచ్చినప్పటికీ ఆమెను బాధ పెట్టే సంఘటనలు జరిగాయని తెలుస్తోంది. కమలహాసన్ తో ఆసిన్ రోమాన్స్ నడుపుతోందనే ప్రచారం తమిళ సినిమా రంగంలో గుప్పుమంది. గజిని సినిమా షూటింగ్ అయిపోగానే ఆమెకు కమల హాసన్ హీరోగా నటిస్తున్న మర్మయోగిలో నటించే అవకాశం వచ్చింది. అందుకు ఆమె తెగ ఆనందపడిపోయినప్పటికీ ఆ అవకాశాన్ని వదులుకుందట. కమల హాసన్ తో సంబంధాలు అంటగట్టడమే ఆమె ఆవకాశాన్ని వదులుకోవడానికి కారణని అంటున్నారు. అయితే ఈ లోగా అమీర్ ఖాన్ ఆమెకు భరోసా ఇచ్చాడట. తదుపరి సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడని తెలుస్తోంది. దీంతో ఆమె హిందీ సినీ రంగంలో సెటిల్ కావాలనే నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు. అయితే అవేవీ ఇంకా ఖరారు కాలేదు.
Story first published: Tuesday, April 21, 2026, 1:18 [IST]