తమిళ పోకిరిలో ఇలియానా బదులు ఆసిన్
తెలుగులో సూపర్‌హిట్ అయిన పోకిరి సినిమా తమిళ రీమేక్‌లో విజయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన బంగారం హక్కులు కొనుక్కుందామనుకుని చివరికి పోకిరి హక్కులతో చెన్నైకి తిరిగి వెళ్ళారు. తెలుగు పోకిరిలో నటించిన అందాల భామ ఇలియానాను తమిళ వెర్షన్‌లో కూడా తీసుకోవాలని విజయ్ శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆమె డేట్స్ లభ్యం కాకపోవడంతో ఆసిన్‌ను ఎంపిక చేసుకున్నట్టు తాజా సమాచారం. కానీ ఇలియానా తమిళ రీమేక్‌లో నటించకపోవడానికి ఆమె డిమాండ్ చేస్తున్న భారీ పారితోషికమే కారణమని తెలుస్తోంది. ఆమె తెలుగులో సినిమాకు 75 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. త్రిష 70 లక్షల ఫీజు డిమాండ్ చేసినప్పుడు అదే భారీ పారితోషికమని చెప్పుకున్నారు. ఇలియానా ఇప్పుడు త్రిషను మించిపోయింది.


Click it and Unblock the Notifications