అసిన్ ను కోలీవుడ్ నిషేధించనుందా..?
బాలీవుడ్ లో 'గజిని"తో ఘనంగా ఎంట్రీ ఇచ్చిన నిలువెత్తు అందం అసిన్, సల్మాన్ ఖాన్‌తో చేసిన 'లండన్ డ్రీమ్స్" ఫ్లాప్ అయ్యేసరికి బాధతో కుంగిపోయింది. ద్వితీయ విఘ్నం దాటలేకపోయాననే బాధలో ఉన్న ఈ అమ్మడికి, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ నుండి పిలుపు వచ్చేసరికి కాస్త ఊపిరి పీల్చుకుంది. ఆ సినిమా ఒప్పుకుందో లేదు, వెంటనే సల్మాన్ ఖాన్ హీరోగా అనీస్ బాజ్మి దర్శకత్వంలో రాబోయే 'రెడీ" హింది రీమేక్‌లో హీరోయిన్‌గా నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చిందని వినికిడి.
లండన్ డ్రీమ్స్ లో అసిన్ తో హీరోగా చేసిన సల్మాన్ ఖాన్, స్వయంగా 'రెడీ" హింది రీమేక్ నిర్మాతలకి అసిన్ పేరును సిఫార్సు చేసాడంట. బాలీవుడ్ జనాల గుసగుసలు ఇలా ఉన్నా, అధికారికంగా ఈ విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ మలయాళ భామ అసిన్ పై కోలీవుడ్ లో నిషేదం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌత్ ఇండియా చాంబర్ ఆప్ కామర్స్ అసిన్ సినిమాలన్ని బ్యాన్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న'రెడీ" చిత్రం షూటింగ్ కోసం శ్రీలంక వెళ్లిన అసిన్ కు, సల్మాన్ లకు ఆ దేశ అధ్యక్షడు 'రాజపక్స" ఆతిథ్యమిచ్చినట్లు తెలిసింది. శ్రీలంకలో తమిళుల ఊచకోతలను నిరసిస్తూ కోలివుడ్ ఇటీవల అక్కడ జరిగిన అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసిన్ రాజపక్స ఆతిథ్యాన్ని స్వీకరించడం కోలీవుడ్ వర్గాలు గుర్రుగా ఉన్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











