కుక్క కోసం ఆసిన్...
నిజమండీ బాబు... ఓ వీది కుక్క కోసం ఆసిన్ చాలా కష్టపడింది. దాన్ని కష్ట పడటం అనడం కంటే ఆసిన్ మంచి మనసు అనడం కరెక్టేమో. ఇటీవల ఆసిన తన కార్ లో చెన్నయ్ ఎయిర్ పోర్టకు వెలుతుండగా ఓ కుక్క పిల్ల తన కారు కింద పడింది. దాని కాలుపై నుంచి ఆసిన్ కారు ఎక్కేసి నుజ్జు నుజ్జయిపోయింది. కుక్కే కదా అని వెళ్లి పోకుండా డ్రైవర్ ను కారు ఆపమని చెప్పి దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. షూటింగ్ నిమిత్తం మళ్లీ ముంబై వెళుతూ దాని బాగోగులు చూసుకోవడానికి ఓ మనిషిని కూడా పెట్టింది. తిరిగి వచ్చే సరికి ఆ కుక్క కోలు కోవడంతో తెగ సంతోష పడి పోయిందట ఈ కేరళ కుట్టి.
ఈ విషయం తెలిసుకున్న ఆమె సన్నిహితులు ఆసిన్ ను తెగ తెగమెచ్చుకున్నారట. ఏది ఏమైనా ఆసిన్ స్మార్ట్ అండ్ యాక్టివ్ మాత్రమే కాదు, వెన్నె లాంటి మనసు కూడా ఉన్న హీరోయిన్. కేవలం ఈ మాత్రం దానికి ఇలా పొగిడేయం లేదు లెండి. ఆసిన్ ఇది వరకు చారిటీ కార్య్రకమాలు చాలానే చేసింది.


Click it and Unblock the Notifications











