twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేటు వేయద్దు వివరణ ఇస్తా: ఫిల్మ్ ఛాంబర్ కి అసిన్‌ రిక్వెస్ట్

    By Srikanya
    |

    శ్రీలంకలో జరుగుతున్న హిందీ చిత్రం షూటింగ్‌ లో పాల్గొనడంపై నడిగర్‌ సంఘంకు వివరణ ఇస్తానని నటి అసిన్‌ పేర్కొన్నారు. ఆమె సల్మాన్ ఖాన్ సరసన రెడీ చిత్రం (తెలుగు రెడీ రీమేక్) లో చేస్తోంది. అందునిమిత్తం శ్రీలంక వెళ్ళింది. దాన్ని తమిళ ఆర్టిస్ట్స్ అశోశియేషన్ తప్పు పట్టింది. తాను కావాలని శ్రీలంక వెళ్ళలేదని, షూటింగ్ నిమిత్తం వెళ్ళాలని, లొకేషన్స్ ఛూస్ చేసుకునే భాధ్యత తనది కాదని ఆమె అన్నారు. శ్రీలంకలో ఉన్న ఆమె ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ చిత్ర పరిశ్రమ నిబంధనలకు కట్టుబడి తాను శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో పాల్గొనలేదని గుర్తు చేశారు. అయితే షూటింగ్‌ ఎక్కడ చేయాలన్నది నిర్మాతల నిర్ణయమని, దాన్ని కాదనే హక్కు తనకు లేదని అన్నారు. ఈ విషయంలో నడిగర్‌ సంఘానికి వివరణ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. శ్రీలంకకు వచ్చిన తాను మొట్టమొదట చేసిన పని ఇక్కడి తమిళులను కలుసుకోవడమేనని అన్నారు.

    జెనీలియా, రామ్ కాంబినేషన్లో వచ్చిన రెడీ చిత్రాన్ని హిందీలో అనీస్ బజ్మీ రీమేక్ చేస్తున్నారు. టి సిరీస్ భూషన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక శ్రీలంకలోని తమిళులను మట్టుబెడుతున్న రాజపక్స ప్రభుత్వ తీరును ఖండిస్తూ ఆ దేశంలో జరిగే ఏ కార్యక్రమానికీ హాజరుకాకూడదని తమిళ చలన చిత్ర పరిశ్రమ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇటీవల శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాలను కూడా కోలీవుడ్‌ బహిష్కరించింది. అలాగే అక్కడ జరిగే షూటింగ్ ‌ల్లోనూ పాల్గొనరాదని నిబంధనలు విధించింది. వీటిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని నటీనటులను హెచ్చరించింది. అయితే తాను ఏ పరిస్థితుల్లో శ్రీలంకలో షూటింగ్‌ లో పాల్గొనాల్సి వచ్చిందనే దానిపై నడిగర్‌ సంఘానికి సరైన వివరణ ఇస్తానని అసిన్‌ తెలిపారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X