అసిన్ కి ఆ రెండు వీక్నెస్ లు
అందరిలాగే అందాల తార అసిన్ కూ రెండు బలహీనతలు ఉన్నాయంటూ కేరళ మీడియా రాసుకొచ్చింది. అలాగే ఆ రెండూ కూడా పి అక్షరంతో ప్రారంభం అవుతాయంటూ ఆసక్తి రేపింది. ఇంతకీ ఆ వీక్నెస్ లు ఏమిటంటే ఒక ఫెరఫ్యూమ్, ప్రాన్స్ ఫ్రై అంటున్నారు. ఈ రెండూ అసిన్ కి ప్రాణం అని అవి ఎక్కడ ఉంటే అక్కడ ఆమె నిలచిపోతుందని రాసుకొచ్చారు. ఆమె స్నేహితులను, శ్రేయాభిలాషులను ఎంక్వైరీ చేసాకే ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పుకొచ్చారు. ఆమె అన్ని విషయాల్లో స్ట్రిక్ట్ గా ఉంటుందని వీటి విషయం వద్దకు వచ్చేసరికి పెద్దగా ఆలోచించకుండా ముందుడగు వేస్తుందంటున్నారు. అంతేగాక ఆమెను మచ్చిక చేసుకోవాలంటే మంచి ఫెరఫ్యూమ్ పట్టుకెళ్ళడి...అంతేగాక ప్రాన్స్ ఫ్రై ని తినిపించండి అంతే అంటున్నారు. సల్మాన్ ఖాన్ కూడా అదే పని చేసి అసిన్ ని మెప్పు పొంది ఉంటారంటూ చెప్తున్నారు. ప్రస్తుతం అసిన్ కేరళలోని తిరువనంతపురం లో ఉంది. గజనీతో ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదగటంతో ఆమె మీద ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











