twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాపం అసిన్ కి మిగిలింది అయోమయమే

    By Srikanya
    |

    లండన్ డ్రీమ్స్ ఫెయిల్యూర్ అవటంతో అసిన్ బాలీవుడ్ డ్రీమ్స్ కూడా తేలిపోయాయి. తాను హీరోయిన్ గా చేసిన బాలీవుడ్ చిత్రం గజనీ ఇప్పుడు గత కాలపు విజయం గా మారింది.అసలు అక్కడి తొలి చిత్రం 'గజిని' ఘనవిజయం సాధించి, అసిన్‌కి అక్కడ ఎనలేని క్రేజ్‌ తెచ్చిపెట్టడంతో బాలీవుడ్‌ నిర్మాతలు అవకాశాలిస్తాని తలుపు తట్టారు. అయితే 'గజిని' తర్వాత చేసిన 'లండన్‌ డ్రీమ్స్‌' సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిపోతుంది, ఆ తర్వాత సినిమాలు ఒప్పుకుంటే పారితోషికం భారీగా డిమాండ్‌ చేయొచ్చని అసిన్‌ అనుకుంది. ఆ మాట బయటికి చెప్పకుండా 'మంచి పాత్ర'లైతేనే చేస్తానని వచ్చిన అవకాశాలను జారవిడుచు కుంది. అక్కడే తప్పటుడుగు వేశారు. 'లండన్‌ డ్రీమ్స్‌' విడుదలై ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఫ్లాప్‌ సినిమాలో భాగస్వామ్యం ఉన్న కథానాయిక కాబట్టి ఇప్పుడు దర్శక, నిర్మాతలు అసిన్‌పట్ల అంత ఉత్సాహం కనబర్చడంలేదు. దాంతో ఆమె చేతిలో సినిమా లేదు. దాంతో ఆమె అయోమంయంలో పడింది. మరో ప్రక్క బాలీవుడ్ పై నమ్మకంతో ఆమె దక్షిణాది నుంచి వచ్చిన అవకాశాలుకు నో చెప్పింది. దాంతో హిందీ రంగంలో పరిస్థితి తారుమారవ్వడంతో దక్షిణాది సినిమాలవైపు మొగ్గు చూపుతున్నారట. విజయ్‌ హీరోగా రూపొందనున్న ఓ తమిళ సినిమా కథని అసిన్‌ వింది. పారితోషికం కూడా ఎంత తక్కువ అయినా ఫరవాలేదు అని అంటోంది. అదీ సంగతి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X