నమితకు ఐలవ్ యు చెప్పిన అసెస్టెంట్ డైరక్టర్
రీసెంట్ గా నమిత ట్విట్టర్ లో ప్రేమ గురించి సందేహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే హఠాత్తుగా నమితకు ఈ డౌట్ ఎందుకొచ్చిందని చాలా మందికి అనుమానం వచ్చింది. అయితే నమితకు ప్రేమపై ఆసక్తి కలగటానికి కారణం ఓ అసెస్టెంట్ డైరక్టర్ అని తేలింది. అయితే అతని ప్రేమను ఆమె రిజక్టు చేసిందిట. అతను తన అందాన్నో, తన కీర్తినో, లేక తన సంపాదనను చూసో ఎట్రాక్టై ప్రపోజల్ పెట్టి ఉండవచ్చునని, తనని నిజంగా మనస్సు పూర్తిగా ప్రేమించేవారితోనే తన జీవితం పంచుకుంటాను అని స్పష్టం చేసిందిట. ఇంత నిర్దాక్ష్యణ్యంగా అతన్ని రిజెక్టు చేసినా అతను చెప్పిన ప్రేమ డైలాగు మాత్రం ఆమె మనస్సులో ముద్రపడిపోయిందిట. అందుకే ట్విట్టర్ లో తను రొమాంటిక్ మూడ్ లో ఉన్నానని ప్రేమ గురించి మాట్లాడమని అందిట. ఇంతకీ ఆమెకు ప్రపోజల్ పెట్టిన ఆ కుర్ర కాబోయే దర్సకుడు తెలుగువాడేనని అంటున్నారు. ఇటీవల ఆమె నటించిన చిత్రం యూనిట్ లో పనిచేసాడని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











