భార్యకి విడాకులిచ్చి ఆ హీరోయిన్‌తో పొలిటికల్ స్టార్ పెళ్లి .. వేణుస్వామి సంచలనం
వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి ఎందుకో ఈ మధ్య సైలెంట్ అయ్యాడు. తన చెప్పిన జోస్యాలు ఫలించకపోవడంతో పాటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ దెబ్బకు ఆయన మౌనం వహించారు. అయితే గత కొద్దిరోజులుగా వేణుస్వామి మళ్లీ యాక్టీవ్ అయ్యారు. కొందరు సెలబ్రెటీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ సూపర్‌స్టార్, హీరోయిన్ల విషయంలో వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
మొదట్లో అస్ట్రాలజర్‌గా కొన్ని ఛానెల్స్‌లో జ్యోతిష్యాలు చెబుతూ వచ్చిన వేణుస్వామి ఎప్పుడైతే సమంత - నాగచైతన్య వివాహం, విడాకుల గురించి చెప్పారో నాటి నుంచి బాగా పాపులర్ అయ్యారు. సమంత సహా కొందరు సెలబ్రెటీల విషయంలో ఆయన చెప్పిన జోస్యాలు ఫలించడంతో జనాలకు గురి కుదిరింది. దాంతో తమ జాతకాలు పట్టుకుని పలువురు ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లడం , వారికి ఏదో పూజలు చేయించడంతో కొందరికి అదృష్టం కలిసొచ్చి స్టార్స్‌గా దూసుకెళ్తున్నారు. ఇక హై ప్రొఫైల్ సర్కిల్స్‌లో వేణుస్వామి పేరు మారుమోగింది.

ఈ పాపులారిటీతో ఛానెల్స్‌లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ రావడం, చెప్పింది చెప్పినట్లుగా జరగడం, పూజలకు కూడా మంచి రిజల్ట్ రావడంతో వేణుస్వామి హవా నడిచింది. గత కొద్దిరోజులుగా వేణుస్వామి ఏది పట్టుకుంటే అది రివర్స్ కొడుతోంది. స్టార్ హీరో ప్రభాస్ జాతకం బాలేదని.. బాహుబలి తర్వాత చేసే సినిమాలు ఫట్ అవుతాయని చెప్పాడు. రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి మూవీస్ నిజంగానే బాక్సాఫీస్ వద్ద బోల్తాపటడంతో అంతా నిజమేనని నమ్మారు. కానీ ఎప్పుడైతే సలార్, కల్కిలు వసూళ్ల వర్షం కురిపించాయో ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామిపై రగిలిపోయారు.
తర్వాత తెలంగాణ , ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఐపీఎల్ విషయంలోనూ వేణుస్వామి చెప్పిన అంచనాలు మిస్ అయ్యాయి. ఇది చాలదన్నట్లు నాగచైతన్య - శోభితాల వైవాహిక జీవితంపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపి మహిళా కమీషన్ మొట్టికాయలు , కోర్టుల వరకు విషయం వెళ్లింది. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ టీవీ5 మూర్తితో వివాదంతో వేణుస్వామి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిణామాలతో ఆయన చాలా కాలం సైలెంట్ అయ్యారు.
ఇక ఇటీవల వరుస ఇంటర్వ్యూలతో దూసుకెళ్తూ తన సంచలన జోస్యాలతో వార్తల్లో నిలుస్తున్నారు వేణుస్వామి. ఇటీవల ఆయన మాట్లాడిన ఆడియో ఒకటి లీక్ అయ్యింది. దీని ప్రకారం ముగ్గురు స్టార్స్ త్వరలో చనిపోతారని.. అందులో ఒక హీరోయిన్, ఒక హీరో ఆత్మహత్య చేసుకుంటారని చెప్పాడు. సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్‌ల జాతకాలు బాలేదని వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌కు ఒంటి నిండా గాయాలే ఉన్నాయని, అయినప్పటికీ బయటికి రావడం లేదని వ్యాఖ్యానించారు. రాజా సాబ్ చిత్రం ఆలస్యం కావడానికి ఇది కూడా ఒక కారణమేనని వేణుస్వామి అన్నారు.
ఇక ఓ ఇంటర్వ్యూలో ఓ సూపర్ స్టార్, ఓ స్టార్ హీరోయిన్‌ల ఎఫైర్ గురించి వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ చిత్ర రంగంలో ఇటీవలే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఓ హీరో ఈ ఏడాది తన భార్యకు విడాకులిచ్చి , ఓ హీరోయిన్‌ను పెళ్లాడతారని వేణుస్వామి బాంబు పేల్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అది ఇళయ దళపతి విజయ్- త్రిషలను ఉద్దేశించేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తమిళనాట రాజకీయాల్లోకి వచ్చింది విజయే.. అలాగే త్రిషతో ఆయన ప్రేమాయణం నడుపుతున్నట్లుగా మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి వేణుస్వామి చెప్పిన జోస్యం నిజమవుతుందో లేదో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా.. మూడు దశాబ్ధాలుగా కోలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు ఇళయ దళపతి విజయ్ జోసెఫ్. సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్, మార్కెట్ కలిగిన నటుడిగా విజయ్ నిలిచారు. కోట్లాది మంది అభిమాన గణం ఉన్న విజయ్ రాజకీయాల్లోకి వస్తారని గత కొన్నేళ్లుగా వార్తలు వచ్చాయి. అయితే కమల్ హాసన్ ఫెయిల్యూర్, రజనీకాంత్ కూడా చివరి నిమిషంలో రాజకీయాలకు దూరం జరగడంతో విజయ్ కూడా కెరీర్ పీక్స్ స్టేజ్‌లో ఉన్న దశలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వరని అంతా అనుకున్నారు.
కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ తన రాజకీయ అరంగేట్రం చేశారు. తమిళగ వెట్రి కళగమ్ (టీవీకే) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఇప్పటికే జరిగిన బహిరంగ సభలో తన వాడి వేడి విమర్శలతో అదరగొట్టేశారు విజయ్. ఎలాంటి తప్పులు జరగకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 26న టీవీకే వార్షికోత్సవం సందర్భంగా మహాబలిపురంలో భారీ బహిరంగ సభను విజయ్ నిర్వహించారు. ఈ సభలో రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్‌ను కేడర్‌కు పరిచయం చేసిన విజయ్.. ఇకపై పార్టీకి ప్రశాంత్ వ్యూహకర్తగా వ్యవహరిస్తారని తెలిపారు.
మరోవైపు.. త్రిష - విజయ్‌ల మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లుగా గత కొద్దినెలలుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి వ్యవహారంపై సింగర్ సుచిత్ర గతంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విజయ్ తన భార్య సంగీతకి విడాకులు ఇవ్వబోతున్నట్లు ఆమె బాంబు పేల్చారు. గతంలో ఎంజీఆర్ - జయలలిత మాదిరిగా విజయ్ - త్రిష ఎఫైర్ ఉంటుందని సుచిత్ర ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇటీవల విజయ్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ తెలియజేస్తూ ఓ ఫోటో షేర్ చేశారు త్రిష.
అందులో త్రిష- విజయ్‌లు లిఫ్ట్‌లో ఉన్నారు. అలాగే కీర్తి సురేష్ - ఆంటోనీ తట్టిల వివాహం గోవాలో జరగ్గా ఈ వేడుకకి త్రిష్ - విజయ్‌లు స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లారు. దీనిని సీక్రెట్‌గా ఉంచినప్పటికీ త్రిష, విజయ్‌ల ఫోటోలు, వీడియోలు, టికెట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక త్రిషకు సినిమాలతో పాటు రాజకీయాలపైనా ఆసక్తి ఎక్కువే. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో ఎప్పటికైనా తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతానని త్రిష అన్నారు. దీంతో త్రిష త్వరలోనే విజయ్ పార్టీలో చేరి తన కలను నెరవేర్చుకుంటారా అంటూ తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు తాజాగా వేణుస్వామి కూడా పరోక్షంగా విజయ్ - త్రిషల బంధంపై జోస్యం చెప్పడం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.


Click it and Unblock the Notifications











