రజనీకాంత్‌ని చంపబోయి స్టంట్ మాస్టర్‌ని పొడిచేశారు.. కత్తిపోటు బలంగా దిగింది!
తమిళ స్టంట్ కొరియోగ్రాఫర్ అతిరాడి అరసు హీరోగా నటిస్తున్న తొలి చిత్రం కబడ్డీ వీరన్. ఈ చిత్ర ఆడియో వేడుక ఇటీవల చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ ఆడియో వేడుకకు రాధారవి, అభిరామ్ రామనాథన్, నటి నమిత లాంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన జాగ్వార్ తంగమ్ మాట్లాడుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాగ్వార్ తంగమ్ మాట్లాడుతూ అతిరాడి అరుసు లేకుంటే రజినీని చంపేసేవారని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

హీరో, దర్శకుడు అతడే
అతిరాడి అరుసు ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే దర్శకుడిగా కూడా బాధ్యతలు నిర్వహించాడు. కబడ్డీ వీరన్ చిత్రం కబడ్డీ నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.అరుసు స్వతహాగా స్టంట్ కొరియోగ్రాఫర్ కావడంతో ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలని చక్కగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాత జాగ్వార్ తంగమ్ మాట్లాడుతూ.. గతంలో అరుసు రజని చిత్రానికి పనిచేసిన సందర్భంగా షూటింగ్ లో జరిగిన ఘటనని వివరించారు.

రజనీని చెంపేసేవారు
గతంలో అరసు రజని చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేశాడు. కర్ణాటకలో షూటింగ్ జరుగుతుండగా కొంత మంది అల్లరి మూకలు సెట్స్ పై దాడికి తెగబడ్డారు. చేతుల్లో కత్తులు కూడా ఉన్నాయి. వారంతా రజనికి సమీపిస్తుండగా అరసు అడ్డుగా నిలిచాడు. ఆ ఘటనలో అరసు కత్తిపోటుకు గురయ్యాడని తంగమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అరుసు అడ్డుగా నిలవకపోయి ఉంటె ఆ గతంలో రజనీని చంపేసేవారని వ్యాఖ్యానించాడు.

ధైర్యవంతుడు
అతిరాడి అరుసు చాలా ధైర్యవంతుడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధృడంగా ఉంటాడు అని జాగ్వార్ తంగమ్ ప్రశంసించాడు. రిక్స్ లు చేయడం అంటే అతడికి ఇష్టం అని జాగ్వార్ తెలిపారు. స్టంట్ మాస్టర్ గా గతంలో అనేక ప్రయోగాలు చేస్తూ ప్రమాదకరమైన గాయాలకు గురయ్యాడు. అయినా కూడా కెరీర్ లో ఎప్పుడూ వెనకడుగు వేయలేదని జాగ్వార్ తెలిపారు.

త్వరలో విడుదల
కబడ్డీ వీరన్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రజని చిత్రానికి సంబందించిన షాకింగ్ విషయాన్ని బయట పెట్టిన జాగ్వార్ ఆ చిత్ర వివరాలు మాత్రం పేర్కొనలేదు. జాగ్వార్ చేసిన వ్యాఖ్యల గురించి రజనీకాంత్ అభిమానుల్లో చర్చ జరగడం ఖాయం. ఇటీవల పేట చిత్రంతో అభిమానులని ఖుషి చేసిన రజని త్వరలో మురుగదాస్ చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











